వైసీపీ విషప్రచారాన్ని నమ్మొద్దు.. కాపులకు పవన్ సూచన

Dont Believe YCPs Poisonous Propaganda Pawans Advice to kapus, Dont Believe YCPs Poisonous Propaganda, YCPs Poisonous Propaganda, Pawans Advice to kapus, YCPs Poisonous Propaganda, Janasena, Pawan kalyan, Kaapu, YCP, CM Jagan, Latest YCPs Poisonous Propaganda News, Latest Pawans Advice News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Janasena, Pawan kalyan, Kaapu, YCP, CM Jagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టు తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో అతిపెద్ద సామాజికవర్గం కాపులదే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 శాతం మంది కాపులు ఉన్నారు. ఏపీలో కాపులే గెలుపోటములను శాశిస్తున్నారు. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో.. ఈసారి కాపు వర్గమంతా తెలుగుదేశం, జనసేన పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పోయినసారి వైసీపీ వైపు చూసిన కాపులు.. ఈసారి ఆ పార్టీని పక్కకు పెట్టి కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే అలర్ట్ అయిన సీఎం జగన్ కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా దాదాపు వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. రేపో.. మాపో ఆయనన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీలోని వైసీపీ నేతలతో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై జగన్ విమర్శలు చేయిస్తున్నారు.

ఈ తతంగంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. కాపులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈసారి ఓడిపోవడం ఖాయమని వైసీపీకి అర్థమయిందని పవన్ ఆరోపించారు. అందకే కాపు ఓట్లలో చీలిక తీసుకొచ్చేందుకు.. కాపు పెద్దలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనను బలహీన పర్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని.. కొందరు వైసీపీ పెద్దలతో కావాలనే తనపై విమర్శలు చేయిస్తోందని ఆరోపించారు. తనపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. వైసీపీ వలలో పడొద్దని కాపులకు జగన్ సూచించారు.

జనసేనకు కాపు సామాజికవర్గంలో బలమైన మద్ధతు ఉండడం చూసి జనసేన జీర్ణించుకోలేకపోతోందని పవన్ మండిపడ్డారు. అందుకే తన గురించి, జనసేన పార్టీ గురించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తోందని అన్నారు. కొందరు కాపు పెద్దలతో కావాలనే కుట్రపూరితంగా జనసేనపై వైసీపీ ప్రయోగిస్తోందని ఆరోపించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తాను ప్రారంభించిన కార్యాచరణ.. జగన్‌కు కంటగింపుగా మారిందని పవన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తీసుకుంటున్న నిర్ణయాలకు విస్తృతమైన మద్ధతు లభిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తాను దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =