సీఎం జగన్ హిట్ లిస్టులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Ex Minister Anil Kumar Yadav to be in CM Jagan's Hit List,Ex Minister Anil Kumar Yadav,CM Jagan's Hit List,Anil Kumar Yadav Jagan's Hit List,Mango News,Mango News Telugu,P CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,YS Jagan Latest News and Updates,YS Jagan Latest News

పెర్ఫార్మెన్స్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అంటూ ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత స్పష్టం చేసేశారు. ఆ క్రమంలోనే 18 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారనే విషయం కూడా వెల్లడించారు. అంతేగాకుండా ఆ 18 మందిలో మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలున్నారని చెబుతూ వారితో నేరుగా మాట్లాడుతానని కూడా సీఎం జగన్ చెప్పారు. దానికి తగ్గట్టుగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే , మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం అనిల్ కుమార్ యాదవ్ సీఎంని కలిశారు.

ముఖ్యంగా గడప గడపకూ కార్యక్రమంలో అనిల్ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత పార్టీ అధినేత ఆదేశించిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించలేదు. దాంతో అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే నెల్లూరు రాజకీయాల్లో అనిల్ వ్యతిరేక వర్గానికి ప్రాధాన్యత పెరిగింది. దాంతో అనిల్ కి టికెట్ కూడా అనుమానమనేననే ఊహాగానాలు వెలువడ్డాయి.

మంత్రిగా ఉండగా జిల్లాలో ఆయన ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఫిర్యాదులున్నాయి. అప్పట్లో రెండో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోగా, అనిల్ మాత్రం అంతా తానే అన్నట్టుగా కొందరు సీనియర్ల పట్ల చిన్నచూపు చూపడం సమస్యగా మారింది. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలనే ఆలోచన జగన్ కి లేనప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన నేతల పట్టుదలతో చివరకు పక్కన పెట్టారని టాక్. దాంతో ఒకసారి ఆయన మంత్రి పదవి పోగానే వ్యతిరేకవర్గం మరింత చురుగ్గా కదిలింది. చివరకు నెల్లూరు సిటీలోనే అనిల్ కి చెక్ పెట్టాలని సంకల్పించింది. ఆయనకు టికెట్ రాకుండా చూడాలని రెడ్లు భావిస్తున్నట్టు ప్రచారం ఉంది.

అనిల్ సమీప బంధువు రూప్ కుమార్ యాదవ్ ని ప్రోత్సహించడం మొదలయ్యింది. మాజీ మంత్రి నారాయణ వంటి వారిని ఢీకొని విజయం సాధించిన అనిల్ కు ఇప్పుడు సొంత ఇంట్లోనే కుంపటి రాజుకోవడం కలకలం రేపుతోంది. వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది పోయి మరింత రాజేసేలా అనిల్ తీరు ఉందనే ప్రచారం కూడా ఉంది. ఏమయినా నెల్లూరు రాజకీయాల్లో అనిల్ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. జగన్ పిలిచి మాట్లాడిన తర్వాత ఆయన వ్యవహారశైలి మారుతుందా లేక జగన్ కాదంటే తాను రాజకీయాలు వదిలేస్తాననే మాట నిజం కావాల్సి వస్తుందా అన్నది ఆసక్తికరం. ఇప్పటికే టీడీపీలో నెల్లూరు టికెట్ కోసం ఆనం రామనారాయణ రెడ్డి లైన్లో ఉన్నారు. అదే జరిగితే అనిల్ కి గట్టి ప్రత్యర్థి అవుతారు. ఇంటిపోరు సమసిపోకుండా ప్రత్యర్థులను ఎదుర్కోవడం సాధ్యం కాదనే విషయం అనిల్ గ్రహిస్తారో లేదో మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 19 =