ప్రొద్దుటూరులో ఈ సారి హవా టీడీపీదేనా?

YCP, Proddutur, Pawan Kalyan, Janasena, Bhimavaram, Alliance, all constituencies, TDP, Chandra Babu, YS Jagan, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
YCP,Proddutur,Pawan Kalyan,Janasena,Bhimavaram, Alliance, all constituencies, TDP, Chandra Babu,YS Jagan,

ఉమ్మడి కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా అన్న విషయం చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. అక్కడ ఉన్న 10 నియోజకవర్గాలలో మూడు ఎన్నికల్లో కూడా ఆ కుటుంబానిదే దే హవా నడుస్తుంది. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు వస్తే..2019 ఎన్నికలలో అది కూడా రాలేదు. అలాంటి కడప జిల్లాలో ఉన్న ముఖ్యమైన నియోజకవర్గం ప్రొద్దుటూరు మాత్రం వైసీపీకి ఏకపక్షం కాదు.అంతముందు టీడీపీ గెల్చుకున్న ఒక్క స్థానంలో ప్రొద్దుటూరు పేరు ఉంది. అందుకే ఇక్కడ ఈ సారి గెలుపు ఎవరిదనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరిగిపోతున్నాయి.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ విజయకేతనం ఎగరవేసినా ఇక్కడ టీడీపీ బలంగానే ఉంది. ఇక నంద్యాల వరద రాజులు రెడ్డి శిష్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లెల లింగారెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరద రాజులు రెడ్డి, లింగారెడ్డి తెలుగు దేశం పార్టీ క్యాంప్‌లో ఉండగా.. శివప్రసాద్‌ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఇప్పుడు గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చూస్తుండగా.. ఈ సారి పసుపు జెండాను ఎగరవేసి తీరుతామని లింగారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రొద్దుటూరులో 2019 ఎన్నికలు జరిగినపుడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏకంగా 59 శాతం ఓట్లు సాధించి ఘన విజయాన్ని సాధించారు. 2014 కంటే 8 శాతం ఓట్లు ఎక్కువగా సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎన్నికలలో వరద రాజులు రెడ్డికి కాకుండా మల్లెల లింగారెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపగా.. ఆయనకు కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే ఓట్లు వచ్చాయి. అయితే లింగారెడ్డి ఎన్నికల ప్రచారంలో వరద రాజులు రెడ్డి యాక్టివ్‌గా పాల్గొనకపోవడమే కాకుండా ఆయన మద్ధతుదారులు కూడా లింగారెడ్డికి సహకరించలేదు. అదే ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన గొర్రె శ్రీనివాసులు.. కేవలం 1 శాతం ఓట్లను రాబట్టుకోగలిగారు

అయితే అక్కడ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న రాచమల్లుపై రోజురోజుకు లెక్కలేనన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయలు కలకలం రేపడంతో పాటు.. మట్కా బిజినెస్ కూడూ ఆయనే నిర్వహిస్తారని టాక్ నడుస్తోంది.అటు రామచల్లు బావమరిది మొత్తం ఈ నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారని.. అంతేకాకుండా ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు కూడా పెరిగిపోయాయని జనాల్లో అసహనం పెరిగిపోయింది. ఇటు ఇసుక మాఫియా , రోడ్లు వేయకపోవడం వంటి ఇతర సమస్యలతో ప్రభుత్వంపైన, ఎమ్మెల్యేపైన కూడా అక్కడ వ్యతిరేకత పెరిగిపోయింది. రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలు కూడా రోడ్డెక్కుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు కాస్త గట్టిగా ప్రయత్నిస్తే చాలు విజయం టీడీపీదే అన్న టాక్ నడుస్తోంది.

మరోవైపు ఈ సారి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు దింపుతారన్న వార్తలతో..ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు..వైసీపీ గవర్నమెంటు కక్షసాధింపులతో ప్రవీణ్ కుమార్ ఇబ్బందులు పడటంతో ప్రజల్లో ఆయనపై సానుభూతి బాగానే పెరిగింది. అటు ఈసారి టికెట్ దక్కించుకోవడానికి ట్రై చేస్తున్న నంద్యాల వరద రాజులు రెడ్డి కూడా ప్రజల్లో బాగానే తిరుగుతున్నారు. ప్రొద్దుటూరులో ఇతనికి ఐదుసార్లు గెలిచిన రికార్డ్ ఉంది. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ..వరద రాజుల రెడ్డి సమీప బంధువే కావడంతో.. ఆయనకు నచ్చచెప్పి ప్రవీణ్ కే టిక్కెట్ ఇవ్వడానికి అధినేత చూస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =