రేపల్లి అభ్యర్థిని మార్చేందుకు జగన్ కసరత్తు

Jagan Is Working To Change Repallis Candidate

ఏపీలో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మారుస్తూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన జగన్.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కకు పెట్టి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. జనబలం తగ్గిన వారిని.. పనితీరు బాగోలేని వారిని.. ఎంతటి వారైనా ఏ మాత్రం వెనుకాడకుండా పక్కకు పెట్టేస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి లెక్క తప్పినట్లు తెలుస్తోంది.

ఇటీవల అభ్యర్థుల మార్పులో భాగంగా గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గావున్న మోపిదేవి వెంకట రమణారావును పక్కకు పెట్టేశారు. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి ఈవూరు గణేశ్‌కు అవకాశం ఇచ్చారు. మోపిదేవి వెంకట రమణ 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. పెట్టుబడులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా పని చేశారు.

అయితే మంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజులకే వెంకటరమణను కేసులు చుట్టుముట్టాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన జైలు పాలయ్యారు. ఆయన మంత్రి పదవి కూడా పోయింది. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు వైసీపీ తరుపున రేపల్లె నుంచి బరిలోకి దిగారు. కానీ రెండు సార్లు ఆయన ఓటమిపాలయ్యారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్.. వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఆ తర్వాత జగన్ శాసనమండలిని రద్దు చేయడంతో.. మోపిదేవిని రాజ్యసభకు పంపించారు. ఆయన పదవీకాలం 2026 వరకు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో రేపల్లె వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన వెంకటరమణ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ చివరికి జగన్.. మోపిదేవికి ఝలక్ ఇచ్చారు. ఆయన్ను పక్కకు పెట్టి రేపల్లె టికెట్ ఈవూరు గణేశ్‌కు కట్టబెట్టారు. అయితే నియోజకవర్గంలో గణేశ్‌పై నెగిటివీ ఉందట. ప్రజలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారట. ఆయన ఓడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. దీంతో జగన్ మళ్లీ మోపిదేవి వెంకటరమణను తెరపైకి తీసుకురావాలని పునరాలోచ చేస్తున్నారట. చూడాలి మరి చివరికి ఏమవుతుందో..

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + three =