బీఆర్ఎస్‌ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

Governor Tamilisai, KCR, BRS
Governor Tamilisai, KCR, BRS

తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన విషయం తెలిసిందే. కేసీఆర్, తమిళిసై మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతలా విభేధాలు కొనసాగాయి. గవర్నర్ విషయంలో కేసీఆర్, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రొటోకాల్ ఫాలో అవ్వలేదు. ఈక్రమంలో పలు సందర్భాల్లో బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తిని వెల్లగక్కారు.

శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తమిళిసై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగం ఎంతో మహేన్నతమైందని.. రాజ్యాంగ నిర్మాతలు ఎందో ముందుచూపుతో దీనిని రూపొందించారని చెప్పారు.  అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని తెలిపారు. ఈ సందర్భంగా  గత బీఆర్ఎస్ సర్కార్‌పై గవర్నర్ భగ్గుమన్నారు. తెలంగాణలో అహంకారపు, నియంతృత్వ పాలనపోయి.. ప్రజాపాలన వచ్చిందని తమిళిసై చెప్పుకొచ్చారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని చెప్పుకొచ్చారు. గత పాలకులు రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా వ్యహరించారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో లేని రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను.. ప్రజాప్రభుత్వంలో తిరిగి పున‌ర్‌నిర్మించుకుంటున్నామని వెల్లడించారు.

రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రభుత్వాలు పాలన సాగించినప్పుడే.. ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతిపేదవాడికి అందుతాయని వివరించారు. ఏకపక్ష నిర్ణయాలు.. నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో  శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి తాను ఎంతో సంతోషిస్తున్నాని తమిళిసై చెప్పుకొచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల దక్కాలనే లక్ష్యంతోనే కొత్త ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు.

ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ చెప్పారు. వందరోజుల్లో కచ్చితంగా అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 9 =