వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి

Janga Krishnamurthy is Planning to Say Goodbye to YCP, Planning to Say Goodbye to YCP, Goodbye to YCP, Janga Krishnamurthy, YCP, CM Jagan, AP Politics, Latest Janga Krishnamurthy Political News, Janga Krishnamurthy News Updates, YCP News, YCP Candidates News, YS Jagan, Andra Pradesh, Political News, Assembly Elections, Mango News, Mango News
Janga Krishnamurthy is Planning to Say Goodbye to YCP, Planning to Say Goodbye to YCP, Goodbye to YCP, Janga Krishnamurthy, YCP, CM Jagan, AP Politics, Latest Janga Krishnamurthy Political News, Janga Krishnamurthy News Updates, YCP News, YCP Candidates News, YS Jagan, Andra Pradesh, Political News, Assembly Elections, Mango News, Mango News

ఏపీలో జంపింగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్నకొద్దీ.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ దక్కనివారు.. అసంతృప్తులు వైసీపీకి రాజీనామా చేసేస్తున్నారు. తెలుగు దేశం, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. వైసీపీలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జంగా కృష్ణమూర్తి 2014 నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. సరైన ప్రధాన్యత దక్కకకపోవడంతో  కొంతకాలంగా కృష్ణమూర్తి వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. అటు అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పటి టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని.. తన కార్యాచరణ ప్రకటిస్తానని బహిరంగంగానే కృష్ణమూర్తి ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈక్రమంలో జంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.

2014 ఎన్నికల ముందు కృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ జంగాను పక్కకు పెట్టేసింది. ఆయన స్థానంలో గురజాల నుంచి కాసు వెంకట కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేశ్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈక్రమంలో జంగా కృష్ణమూర్తి అలకబూనడంతో.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అంతేకాకుండా టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని కూడా హైకమాండ్ హామీ ఇచ్చింది.

ఆ తర్వాత జంగా కృష్ణమూర్తిని పక్కకు పెట్టి జగన్.. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. రెండో విడతలో కూడా ఆయనకు మొండి చేయి చూపించి భూమన కరుణాకర్ రెడ్డికి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి జంగా అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈసారి కూడా గురజాల టికెట్ మహేశ్ రెడ్డికే ఇచ్చేందుకు జగన్ మొగ్గుచూపుతున్నారట. దీంతో ఆయన పార్టీ మారేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన తర్వాతి కార్యాచరణ ఏంటి..? ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =