అయోధ్య గర్భగుడికి చేరుకున్న బలరాముడు

Balarama Reached The Sanctum Sanctorum Of Ayodhya, Balarama Reached The Ayodhya, Sanctum Sanctorum Of Ayodhya, Ayodaya, Ayodya Temple, Balaramudu, PM Modi, Sanctum Sanctorum Telugu, Latest Ayodhya Updates, Ayodhya News, Latest Ayodhya News Update, Sri Rama, Mango News, Mango News Telugu
Ayodaya, Ayodya Temple, Balaramudu, PM Modi

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఈనెల 22న జరగనున్న విషయం తెలిసిందే. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరగనుంది. 22న మధ్యాహ్నం 12:29:08 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.  ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు యావత్ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున శ్రీరాముని భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మకి శోభను సంతరించుకుంది.

ఇక ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి కీలక ఘట్టాలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. బాల రాముడు అయోద్య గర్భగుడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఏటీఎస్ కమాండోల భద్రత మధ్య రామ జన్మభూమి ఆవరణ నుంచి క్రేను సహాయంతో గర్భగుడిలోకి తీసుకొచ్చారు. గర్భగుడిలో కొలువుదీరిన బలరాముడి విగ్రహం ముఖం, వైభాగాన్ని పసుపు, తెలుపు వస్త్రాలతో కప్పి ఉంచారు. రాముడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నిలుచున్న రూపంలో ఈ విగ్రహంలో దర్శనమిస్తున్నారు.

22న ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ బాలరాముడి విగ్రహానికి ఉన్న వస్త్రాలను తొలగించి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత హారతి ఇచ్చి పూజలు చేయనున్నారు. ఈ బాలరాముడి విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళాలు. విగ్రహం 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని చెక్కారు. ప్రస్తుతం బలరాముడి విగ్రహ ఫొటోలను బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + four =