అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి నిశ్చయించుకున్న టీడీపీ

TDP Decide To Attend For The Assembly Session Without Chandrababu Naidu, TDP Decide To Attend For The Assembly Session Without Nara Chandrababu Naidu, Assembly Session Without Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, TDP Decide To Attend For The Assembly Session, Assembly Session, AP Assembly Session, 2022 AP Assembly Session, AP Assembly Session 2022, TDP, AP Assembly Session Without Nara Chandrababu Naidu, TDP Decide To Attend For The AP Assembly Session, AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? టీడీపీ ఏ నిర్ణయం తీసుకోనుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ సమావేశాలకు టీడీపీ హాజరవ్వాలని ఈ రోజు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? టీడీపీ ఏ నిర్ణయం తీసుకోనుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా.. ఈ సమావేశాలకు టీడీపీ హాజరవ్వాలని ఈ రోజు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ లోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే, దానికి చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసింది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో తన భార్య భువనేశ్వరిని అధికార పార్టీ సభ్యులు కించపరిచారని ఆరోపిస్తూ చంద్రబాబు ఇకపై అసెంబ్లీకి రానని ప్రకటించారు. ఒకవేళ వస్తే, తిరిగి సీఎంగానే సభకు వస్తానని చంద్రబాబు శపథం కూడా చేశారు. అందుకే, ఇప్పుడు చంద్రబాబు బాటలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లమని నిర్ణయించుకున్నప్పటికీ, ప్రజా సమస్యల గురించి అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేయటం మన బాధ్యత అని, నేను రాకపోయినా.. మీరందరు వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఇలాగే ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా ఆయన తరపున మిగిలిన పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లారని తెలిపారు చంద్రబాబు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − four =