ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ

TDP Leader Nara Lokesh Writes Letter to CM YS Jagan to Support Aqua Sector,Nara Lokesh letter to CM YS Jagan,support aqua sector,TDP Leader Nara Lokesh,Nara Lokesh Writes Letter to CM,Mango news,Mango news Telugu,Nara Lokesh Latest News And Updates,TDP Leader Nara Lokesh News and Live Updates,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఓ లేఖ లేశారు. విద్యుత్ రాయితీ, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవడం, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి సంక్షోభంలో పడిన ఆక్వారంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ మేరకు నారా లోకేష్ సీఎంకు రాసిన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు.

“ఆక్వారంగం రైతులు తీవ్రనష్టాలతో అప్పుల పాలవుతున్నారు. రొయ్యల పెంపకం చేపట్టి అప్పులు పాలయ్యే బదులు ఆక్వా హాలిడే వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో కొత్త చట్టాలు తెచ్చి, వేధింపులకు గురిచెయ్యడం, ఆక్వా రంగం రైతుల్ని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై స్పందించి ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రూ.1.50 చొప్పున ఇవ్వాలి. నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయాలి. దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి రొయ్యలకి మద్దతు ధర ప్రకటించాలి” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =