టీడీపీ మొదటి జాబితా వచ్చేది అప్పుడే..

The First List Of TDP Will Come Just Then, First List Of TDP, TDP First List, AP Assembly Elections, Telugu Desam Party, TDP Candidates List, Latest TDP First List, TDP First List News, Latest TDP News, TDP, Chandra Babu Naidu, Telangana, Mango News, Mango News Telugu
AP Assembly elections, Telugu desam party, TDP Candidates list

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇంఛార్జ్‌లను మార్చుతూ విడతల వారీగా జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జాబితాలు విడుదల చేయగా.. మొత్తం 38 మంది ఇంఛార్జ్‌లను ఛేంజ్ చేశారు. అతిత్వరలోనే మూడో జాబితాను విడుదల చేయనున్నారు. ఇక ఈసారి వైసీపీని గద్దె దించేందుకు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న టీడీపీ-జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

ఇప్పటికే జనసేన పోటీ చేయబోయే స్థానాలపై ఏకాభిప్రాయం కుదరడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారట. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలు ఉండబోవని.. ఖచ్చితంగా పోటీ చేసే 20-25 నేతల పేర్లు ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేశ్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంత మంది పేర్లు ఉంటాయని అంటున్నారు.

ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.  అయితే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారానే దాదాపు టికెట్లు ఎవరెవరికి దక్కుతాయనేది సంకేతాలు అందుతున్నాయి. ఇకపోతే ఈసారి టీడీపీ వెంకటగిరి, చీరాల, మాడుగుల గోపాలపురం నియోజకవర్గాల సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావాలని హైకమాండ్ భావిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =