మురుగుడు లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Lavanya, Lokesh, Murugadu Lavanya's background, Murugadu Lavanya,Murugudu Hanumantha Rao, YSR, Jagan, Kandru Kamala,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Lavanya, Lokesh, Murugadu Lavanya's background, M,urugadu Lavanya,Murugudu Hanumantha Rao, YSR, Jagan, Kandru Kamala

ఏపీలో  ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. అధికార వైసీపీతో డీకొనడానికి టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలకు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ వైనాట్ 175 అంటూ  గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో స్ట్రాటజీని ఫాలో అవుతూ అడుగులు వేస్తున్నారు.  కుప్పం, హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహాలతో ముందుకెళ్తోన్న వైసీపీ..ఇటు మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడించడానికి కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. లోకేష్‌కు చెక్ పెట్టడానికి  మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని బరిలోకి దించింది.

దీంతో లోకేష్‌ను గతంలో సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిలబడటంతో.. గాలి అటు మళ్లింది కానీ  ఏ నమ్మకంతో లావణ్యను లోకేష్‌తో పోటీ పడటానికి దింపారనే చర్చలు నడుస్తున్నాయి.   అసలు లావణ్య ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ ఆరాలు తీస్తున్నారు.  175 స్థానాలలో 175 కొడతామన్న ధీమాను వ్యక్తం చేస్తూ.. ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్న జగన్..దీనికోసం  అభ్యర్థులను మారుస్తూ ప్రతిపక్షాలను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు.

తాజాగా మంగళగిరి, నెల్లూరు పార్లమెంట్, కర్నూలు అసెంబ్లీలకు ఇన్ ఛార్జీలకు నియమించారు. ఇందులో మంగళగిరి నుంచి మురుగుడ లావణ్యను ఇన్చార్జ్‌గా నియమించారు. మంగళగిరిలో నారా లోకేష్‌ ను ఢీ కొట్టే  మురుగుడు లావణ్య ..  మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. అంతేకాదు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా. స్థానికంగా ఆమెకు పట్టు ఉండటంతోనే లోకేష్‌ను డీకొట్టడానికి లావణ్యను ప్రవేశపెట్టారు. దీనికి తోడు ఉమెన్ కార్డు వాడటం వైసీపీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఇటు లావణ్య మామగారైన మురుగుడు హనుమంతరావు విషయానికి వస్తే ఆయనకు  దివంగత నేత వైఎస్‌ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.   1987లో వైఎస్‌ఆర్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా మురుగుడు హనుమంతరావు గెలిచారు. దీంతో పాటు  1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్‌ఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

మరోవైపు లావణ్య తల్లి అయిన కాండ్రు కమల 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి తర్వాత టీటీడీ బోర్డు మెంబర్‌గా పని చేశారు. అలా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారిళ్లు కూడా రాజకీయ నేపథ్యం కలిగి  ఉండటంతో ఆమెకు కూడా రాజకీయాలపై పట్టుంది. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుండంతో లోకేష్‌ను డీకొట్టే సత్తా ఉన్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =