2019 కంటే మంచి ఫలితాలు సాధిస్తుందా?

Will Congress Rise In AP?, Sharmila Congress Party Future, Congress Party Future, Congress Party Future In Andhra Pradesh, Andhra Pradesh Congress, Congress Party Future Sharmila, Sharmila, Kadapa, AP Congress, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
sharmila congress party future in andhra pradesh elections 2024 telugu news

ఏపీ నాట సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన పార్టీల్లో కాంగ్రెస్‌ ఒకటి. టీడీపీ ఆవిర్బానికి ముందు కాంగ్రెస్‌ను కొట్టే పార్టీయే లేదు. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమయంలోనూ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. ఆయన మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన లాంటి అంశలతో కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలకు ప్రేమ పోయింది. నిజం చెప్పలంటే 2014 సమయంలో కాంగ్రెస్‌ను ఏపీ ప్రజలు ద్వేషించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆ పార్టీని సున్న సీట్లు ఇచ్చి ఇంటికి పంపారు. ఇక 2019లోనూ సేమ్ సీన్‌. ఏపీలో చాలా చోట్ల నోటా కంటే తక్కువ సీట్లు దక్కించుకున్న పార్టీ కాంగ్రెస్‌. అయితే ఈ సారి పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. వైఎస్‌ కూతురు షర్మిలా ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం. అయితే గతంతో పోల్చితే ఏపీలో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తుందా?

గతం గొప్ప.. మరి ప్రస్తుతం?

బలమైన కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి వెన్నెముక. అత్యధిక సంఖ్యలో ప్రధాన మంత్రులను ఇచ్చిన పార్టీకి ఎదురులేని వారసత్వం ఉంది. అయితే అదంతా గతం..! ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో పార్టీ ఉనికి కోసం మొండిగా పోరాడుతోంది. గతంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా గత ఎన్నికల్లో ఓట్లు పొందడంలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకులకు కూడా ఓట్లు పడలేదు. అయితే షర్మిలా వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్‌లో జోష్‌ పెరిగిన మాట వాస్తవమే.

కష్టమే..:

అయితే షర్మిల ఎంట్రీ గ్రాండ్‌గా జరగలేదనే చెప్పాలి. ఆమె ప్రమాణస్వీకార సమయానికి కాంగ్రెస్‌ పార్టీ అవుట్‌డేటెడ్‌ లీడర్లు తప్ప ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న నాయకులు లేరు. ఆ తర్వాత ఆళ్లనాని లాంటి నేతలు వచ్చినా మళ్లీ రిటర్న్‌ వెళ్లిపోయారు. వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని షర్మిల వర్గం భావించింది. అయితే అసలు అలాంటివి ఏమీ జరగలేదు. ఇక సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు రాష్ట్రానికి వచ్చినా పెద్దగా మార్పు ఉండదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2019తో పోల్చితే ఓటు పర్సెంటేజ్‌ పెరిగే ఛాన్స్ ఉందని.. ఒక ఎమ్మెల్యే సీటు వచ్చినా గొప్ప విషయమేనంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eighteen =