ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 6 మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ

AP Govt Issued Notification Regarding Formation of Six New Mandals in The State,AP Govt Issued Notification,AP Govt Regarding Six New Mandals,AP Govt Six New Mandals Notification,Formation of Six New Mandals in The State,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan,AP Bjp Chief Somu Verraju,YSR Congress Party,Telugu Desam Party,Janasena Party,BJP Party,YSR Party,TDP Party,JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Andhra Pradesh Latest Investments, Andhra pradesh Politics,AP Governer,AP Cabinet Minister,AP Ministers,Andhra Pradesh Welfare Schemes,AP CM Jagan Latest News and Live Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని 6 జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజించింది. వీటిలో.. ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లా కేంద్రాలను అర్బన్ మరియు రూరల్ కేంద్రాలుగా విడదీయగా.. మచిలీపట్నాన్ని సౌత్ మరియు నార్త్ మండలాలుగా విభజించింది. మచిలీపట్నంలోని 1-19 వార్డులు మరియు 40వ వార్డుతో పాటు 18 గ్రామాలను కలిపి మచిలీపట్నం నార్త్ మండలంగా.. అలాగే 20-39 వార్డులు, రూరల్ సహా మరో 12 గ్రామాలను కలిపి మచిలీపట్నం సౌత్ మండలంగా ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలకు కీలక సూచన చేసింది. ఈ మండలాల విభజనపై ఏవైనా అభ్యంతరాలుంటే ఒక నెలలోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలపాలని కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =