పాక్ ని దూకుడు తగ్గించుకోమన్న అమెరికా

#Article370, America warns Pakistan, America warns Pakistan against any infiltration, article 35a kashmir, article 370 debate, Article 370 Fall Out, article 370 issue, article 370 kashmir, Article 370 Revoked, Jammu, Jammu and Kashmir, Jammu and Kashmir Issue, Kashmir, Mango News Telugu, pakistan, what is article 370

భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో పాకిస్తాన్ చూపిస్తున్న అత్యుత్సహంపై అమెరికా స్పందించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విషయంలో జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా వెల్లడించింది. ఇరు దేశాలు స్పందిస్తున్న తీరుని గమనిస్తున్నామని, భారత్ తో వాణిజ్య వ్యవహారాలు రద్దు, దౌత్య సంబంధాల పై పాకిస్తాన్ వ్యవరిస్తున్న తీరు పై అమెరికా ప్రతినిథులు స్పందించారు. పాకిస్తాన్ తన దూకుడు తగ్గించి నడుచుకోవాలి, మరియు పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని, ఎల్ఓసీ లోపలకు చొరబాటు ప్రయత్నాలు మానుకుని పాకిస్తాన్ భూభాగంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ కు స్పష్టం చేసింది.

జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు ఇతర నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకేసి భారత్ చర్యలతో, పుల్వామా లాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశమయ్యి భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆదేశంలో పని చేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను బహిష్కరించింది. మరో వైపు పాక్ హైకమిషనర్ ను కూడ భారత్ కు పంపకూడదని నిర్ణయం తీసుకుంది. జరుగుతున్న సంఘటనలను గమనిస్తున్న అమెరికా ఎటువంటి దూకుడు చర్యలు చేపట్టకుండా ఉండాలని పాకిస్తాన్ కు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

 

[subscribe]
[youtube_video videoid=vh-Hmc5YGoY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here