రామాయణ, మహాభారతాలకు పాలపిట్టకు సంబంధమేంటి..?

Why do you see milk quail on Dussehra day,Why do you see milk quail,milk quail on Dussehra day,Mango News,Mango News Telugu,Dussehra 2023,Dussehra, Palapitta,milk quail on Dussehra, relation of Palapitta to Ramayana, Mahabharata,Dussehra day Latest News,Dussehra day Latest Updates,Dussehra 2023 Latest News,milk quail on Dussehra News,milk quail on Dussehra Latest News,milk quail on Dussehra Latest Updates
Dussehra 2023,Dussehra, Palapitta,milk quail on Dussehra, relation of Palapitta to Ramayana, Mahabharata

దసరా పండుగను కొంతమంది విజయ దశమిగా పిలుచుకుంటారు. ఈ దసరా పండుగ వచ్చిందంటే చాలు.. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు బిజీగా మారిపోతారు. ఒక్కో రోజు  ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ పులకరించిపోతారు. అయితే   దసరా పండుగ పేరు ఒక్కటే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయంతో ఈ పండుగను చేసుకుంటారు.  దుర్గా నవరాత్రులను తెలంగాణలో బతుకమ్మగా జరుపుకోగా..ఆంధ్ర ప్రదేశ్‌లో దేవీ నవరాత్రులుగా జరుపుకొంటారు.

తెలంగాణలో దసరా సమయంలో పాలపిట్టకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలపిట్టను రాష్ట్ర పక్షిగానూ ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా దసరా పండుగ రోజు  ‘పాలపిట్ట’ను చూడటం తెలంగాణలో ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. దసరా రోజు పాలపిట్టను చూడటాన్ని తమ అదృష్టంగా, శుభ సూచకంగా  భావిస్తుంటారు. సాధారణ రోజుల్లో పాలపిట్ట కనిపించినా కనిపించకపోయినా విజయదశమి రోజు మాత్రం కచ్చితంగా కనిపిస్తుందని తెలంగాణావాసులు నమ్ముతారు.

విజయ దశమి రోజు  గ్రామాల్లో ప్రజలు ప్రత్యేకించి పాలపిట్టను చూడటానికి పొలాలకు వెళతారు. సిటీలలో పక్షులు పెద్దగా కనిపించవు కాబట్టి.. పండుగ రోజు పల్లెటూరిలో పాలపిట్టను చూడటానికి  ప్రత్యేకించి చూడటానికి వెళతారు.నిజానికి పాలపిట్టను దసరా రోజు చూడటం వెనుక ఓ కథ ఉందని పెద్దలు చెబుతారు.  పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోవడంతో.. కౌరవులు,పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసానికి, అజ్ఞాత వాసానికి వెళతారు. ఆ తర్వాత అరణ్య, అజ్ఞాత వాసాలు రెండూ  ముగించుకుని తిరిగి వస్తుండగా పాండవులకు దారిలో పాలపిట్ట కనిపించిందట.

అలా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాత వాసం ముగించుకుని వచ్చిన రోజు ..విజయదశమి  రోజేనట. పాలపిట్ట కనిపించింది విజయదశమి రోజే కాబట్టి తమకు అన్నీ శుభాలు, విజయాలే కలుగుతాయని అప్పుడు పాండవులు నమ్మారట. పాండవుల నమ్మినట్లుగానే ఆ తర్వాత కురుక్షేత్రం యుద్ధం జరగటం..ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించటం జరిగింది. అప్పటి నుంచి విజయదశమి రోజు పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది.  అంతేకాదు.. పాలపిట్టకు రామాయణానికి కూడా సంబంధం ఉందని  పురాణాలు చెబుతాయి. శ్రీ రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు కూడా పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని  అందుకే విజయం సాధించాడని రామాయణం చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 1 =