భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం, 18+ వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

Bharat Biotechs Intranasal Covid Vaccine Gets DCGI Approval for Restricted Emergency Use in 18 Plus Age Group, Bharat Biotechs Intranasal Covid vaccine, Indias First Intranasal Covid Vaccine, DCGI Nod To Bharat Biotechs Intranasal Covid, Bharat Biotech, Intranasal Covid Vaccine , Covid Vaccine, Covid Vaccine For 18 Plus Age Group, Covid Vaccine Latest News And Updates, Drug Controller General of India

దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ (బీబీవి154) ను 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి పరిమితులతో కూడిన అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులిచ్చింది. దేశంలో కోవిడ్-19 యొక్క మొట్టమొదటి నాసల్/చుక్కల మందు వ్యాక్సిన్ ఇదే. ముక్కు/నాసికా ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్ ను తాజాగా 18 ఏళ్లుపైబడిన వారికీ అందించేలా డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ ట్వీట్ చేస్తూ, “కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటానికి పెద్ద ప్రోత్సాహం. భారత్ బయోటెక్ యొక్క ChAd36-SARS-CoV-S COVID-19 (చింపాంజీ అడెనోవైరస్ వెక్టర్డ్) రీకాంబినెంట్ నాసికా వ్యాక్సిన్ 18+ వయస్సు గల వారిలో కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రాథమిక రోగనిరోధకతకై అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేత ఆమోదించబడింది. ఈ చర్య కోవిడ్ మహమ్మారిపై మన సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారతదేశం తన సైన్స్, ఆర్ అండ్ డి మరియు మానవ వనరులను ఉపయోగించుకుంది.సైన్స్-ఆధారిత విధానం మరియు సబ్కా ప్రయాస్‌తో మనం కోవిడ్-19ని ఓడిస్తాము” అని పేర్కొన్నారు. మరోవైపు భారత్ బయోటెక్ బీబీవి154 ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఫేజ్ 3 ట్రయల్స్ మరియు బూస్టర్ డోస్‌ల కోసం క్లినికల్ డెవలప్‌మెంట్‌ ను ఇప్పటికే పూర్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 8 =