జూలై 31 నాటికి సీబీఎస్‌ఈ 12వ తరగతి పలితాలు, మార్కుల కేటాయింపు విధానం ఇదే…

CBSE, CBSE 12th Result 2021 Evaluation Criteria, CBSE 12th Results LIVE, CBSE Class 12 Result Live Updates, CBSE Class 12 Results, CBSE Class 12 Results Likely to Release by July 31, CBSE Submits Assessment Formula in Supreme Court, CBSE submits class 12 assessment formula in Supreme Court, CBSE to Evaluate Students on 3 Years, CICSE 12th results live updates, Class 12 Result LIVE Updates, Mango News

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను జూలై 31 నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముందుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం 12వ తరగతి ఫలితాల ప్రమాణాలను ఖరారు చేసేందుకు 12 మంది సభ్యుల కమిటీని సీబీఎస్‌ఈ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల ఫలితాలపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ మూల్యాంకన ప్రమాణాలను కోర్టుకు వివరించారు.

12 తరగతి ఫలితాల కోసం (30+30+40) ప్రాతిపదిక అమలు చేయనున్నట్టు చెప్పారు. 10వ తరగతి నుంచి 30 శాతం వెయిటేజీ(బోర్డు పరీక్షలలో 3 బెస్ట్ సబ్జెక్ట్స్ మార్క్స్ ఆధారంగా), 11 వ తరగతి నుంచి 30 శాతం వెయిటేజీ (ఫైనల్ పరీక్షా ఆధారంగా) మరియు 12 తరగతి నుంచి 40 శాతం వెయిటేజీ (యూనిట్ పరీక్షలు/ మిడ్-టర్మ్/ప్రీ-బోర్డు పరీక్ష) ఆధారంగా 12వ తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయించి ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్‌ఈ తరపున కోర్టుకు వివరించారు. అయితే బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − three =