భారత్ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం

Central Govt Appoints Lt General Anil Chauhan as the Next Chief of Defence Staff, Lt Gen Anil Chauhan, India New Chief Of Defense Staff, Anil Chauhan India Chief Of Defense Staff, Anil Chauhan, Chief of Defence Staff, Mango News, Mango News Telugu, India's New CDS Live Updates, CDS, Chief of Defence Staff, Govt Appoints Lt Gen Anil Chauhan As CDS, Lt Gen Anil Chauhan CDS, Anil Chauhan CDS News And Live Updates

దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్) నియామకంపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) ను నూతన సీడీఎస్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మరియు తదుపరి ఉత్తర్వుల వరకు భారత ప్రభుత్వం, సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేస్తారని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అనేక కమాండ్, స్టాఫ్ మరియు ఇన్‌స్ట్రుమెంటల్ నియామకాలను కలిగి ఉన్నారని, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో విస్తృతమైన అనుభవం కలిగి ఉన్నారని కేంద్రం తెలిపింది.

1961 మే 18వ తేదీన జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ 1981లో ఇండియన్ ఆర్మీకి చెందిన 11 గూర్ఖా రైఫిల్స్‌లోకి ప్రవేశించారు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌ల పూర్వ విద్యార్థి. అలాగే మేజ్ జనరల్ హోదాలో, అధికారి నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాముల సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత లెఫ్టినెంట్ జనరల్‌గా, నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించారు మరియు తదనంతరం సెప్టెంబర్ 2019 నుండి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ అయ్యారు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఈ కమాండ్ అపాయింట్‌మెంట్‌లతో పాటు, ఆఫీసర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో సహా ముఖ్యమైన సిబ్బంది నియామకాలను కూడా పర్యవేక్షించారు. అంతకుముందు అంగోలాకు ఐక్యరాజ్యసమితి మిషన్‌గా కూడా పనిచేశారు.

లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ 2021, మే 31న భారత సైన్యం నుండి పదవీ విరమణ పొందారు. ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, ఆయన జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక విషయాలలో తన సహకారం కొనసాగించారు.సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) విశిష్టమైన మరియు గొప్ప సేవలకు గానూ పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం మరియు విశిష్ట సేవా పతకం పొందారు.

కాగా భారత్ తొలి మహా దళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌)గా బిపిన్‌ రావత్‌ విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే 2021 డిసెంబర్ లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ మరణించారు. ఈ క్రమంలోనే నూతన సీడీఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముందుగా దేశంలో త్రివిధ దళాల మధ్య అవగాహనా, త్వరితగతిన నిర్ణయాలు, తగిన సమన్వయం కోసం కొత్తగా సీడీఎస్‌ను నియామకంను కేంద్రం చేపట్టింది. సీడీఎస్‌కు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 65 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సైన్యం, నౌకాదళం, వాయుసేన అధిపతులలో ఎవరైనా సీడీఎస్‌గా నియమితులైతే 65 సంవత్సరాలవరకు ఆ పదవిలో కొనసాగేందుకు వీలుగా వాటి సర్వీసు నిబంధనలను గతంలో రక్షణ శాఖ సవరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =