రేపటి నుంచే మూడురోజుల పాటుగా సీఎం జగన్ కడప జిల్లా పర్యటన

Andhra CM YS Jagan Mohan Reddy, AP CM To Tour Kadapa District, AP CM YS Jagan, AP CM YS Jagan To Tour in Kadapa District, AP CM YS Jagan to Tour in Kadapa District From December 23 to December 25th, AP CM YS Jagan will Tour in Kadapa District, Ap Political News, Jagan to tour Kadapa, Mango News, YS Jagan Mohan Reddy To Visit Kadapa, YS Jagan to Tour in Kadapa District From December 23, YS Jagan to tour Kadapa district, YS Jagan Tour in Kadapa District, YSR

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు మూడు రోజుల పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం కడపకు బయలుదేరనున్నారు. 23న బొల్లవరంలో బహిరంగ సభతో పాటుగా, బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం, సీకే దిన్నె మండలంలోని కొప్పర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. డిసెంబర్ 24న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం పులివెందుల పరిధిలో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన, వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగసభతో పాటుగా మోడల్‌ పోలీసుస్టేషన్‌, ఆక్వా హబ్‌ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు.

ఇక డిసెంబెర్ 25న పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో సీఎం వైఎస్ జగన్‌ పాల్గొననున్నారు. అనంతరం సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని నివాసానికి సీఎం వెళ్లనున్నారు. ఇక డిసెంబర్ 25 మధ్యాహ్నం 1:35 గంటల నుంచి తిరుగుప్రయాణం ప్రారంభించి, కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, మధ్యాహ్ననికి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =