కాఫీ బ్యాడ్జింగ్‌తో బాసుల్లో గుబులు

Coffee Badging Trend in Companies,Coffee Badging Trend,Badging Trend in Companies,Coffee Badging,Coffee badging trend in companies,Employees, Remote Work, Work From Home,Mango News,Mango News Telugu,New Coffee Badging Job Trend,1As employees return to office,Post Pandemic Employee,Coffee Badging Trend Latest News,Coffee Badging Trend Latest Updates,Coffee Badging Trend Live News,Companies Trend Latest News
Coffee Badging,Coffee badging trend in companies,Employees, Remote Work, Work From Home

ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను రద్దు చేసేసాయి. ఆఫీసుకు రావాలని పిలుపు నివ్వడంతో.. మూడేళ్లుగా ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్న తమను .. ఆఫీసులో పని చేయాలని ఆదేశించడం ఉద్యోగులు ఏ మాత్రం జీర్ణించు కోలేకపోతున్నారు. దీంతో కాఫీ బ్యాడ్జింగ్‌ అనే కొత్త ట్రెండ్‌తో తమ తమ కంపెనీలను కలవరానికి గురి చేస్తున్నారు.

కోవిడ్‌-19 తర్వాత చాలా వరకు పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో ఇప్పటి వరకూ రిమోట్‌గా వర్క్‌ చేస్తున్న సిబ్బందిని ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. దీన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు.. కాఫీ బ్యాడ్జింగ్‌ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీని ప్రకారం.. ఎవరైతే ఆఫీస్‌లో పనిచేయడాన్ని ఇష్టపడలేదో  వారంతా ఆఫీస్‌లో ఐడీని స్వైప్‌ చేసి లాగిన్ అవుతారు. కానీ ఆ తర్వాత  కొలీగ్స్‌తో కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్తారు. అక్కడ హెచ్‌ఆర్‌, మేనేజర్ల దృష్టిలో పడి.. ఈ తర్వాత డెస్క్‌కు వచ్చి ఇంటికి వెళ్లిపోతారు. ఈ విధానాన్నే కాఫీ బ్యాడ్జింగ్‌ అంటారు.

ఈ ఏడాదిలో హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న ప్రతి 5 మంది ఉద్యోగులలో ఒకరు మాత్రమే ఆఫీసుకు వచ్చి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అంతే  37 శాతం మంది హైబ్రిడ్‌ వర్క్‌కే ఓటేస్తుంటే.. 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్‌ వర్క్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని ఓల్‌ ల్యాబ్స్‌ అనే సంస్థ తమ నివేదికలో తెలిపింది.

ఓల్‌ ల్యాబ్స్‌ చేసిన సర్వేలో.. తప్పని సరిగా ఆఫీస్‌లో పనిచేయాలన్న కంపెనీల నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగం మంది అంటే 58శాతం మంది కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. ఆఫీసులో ఉంటున్న మరో 8 శాతం మంది కలిసి రోజూ కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడడంతో ఆఫీస్‌ పనులు నిర్వహించడం యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది.

కంపెనీలో ప్రతీ డిపార్ట్మెంట్‌లో ఒకరో, ఇద్దరో ఎంప్లాయిస్ ఈ  కాఫీ బ్యా‍డ్జింగ్‌కు పాల్పడితే కంపెనీలకు పెద్ద నష్టం ఉండేది కాదు కానీ సగానికి పైనే ఇలా ప్రవర్తించడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. హై స్కిల్‌ ఉన్న ఉద్యోగులు మూకుమ్మడిగా ఆఫీస్‌‌కు వచ్చి కూడా  పనిచేయకుండా కాఫీ కప్పులతో  దర్శనమిస్తూ కబుర్లు చెప్పుకోవడం మ్యానేజ్‌మెంట్‌కు మింగుడు పడడం లేదు. దీంతో క్లయింట్స్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ డెడ్ లైన్ లోగా పూర్తి చేయలేకపోతున్నాయి కంపెనీలు. మరీ గట్టిగా వార్న్ చేద్దామన్నా హై స్కిల్స్  ఉన్న ఉద్యోగులు ఎక్కడ చేజారిపోతారోనన్న భయం కంపెనీలకు వెంటాడుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =