ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది ఆ ధ్యానం ఎందుకు చేస్తారు?

What is Vipassana meditation,What is Vipassana,Vipassana meditation, Why Delhi CM does Vipassana meditation ,Vipassana, Health Benefits,Mango News,Mango News Telugu,About Vipassana,What Exactly Is Vipassana,How To Do Vipassana Meditation,Vipassana Explained,Different Types of Techniques,Vipassana meditation Latest News,Vipassana meditation Latest Updates,Delhi CM Latest News,Delhi CM Latest Updates
What is Vipassana meditation?, Why Delhi CM does Vipassana meditation ,Vipassana meditation, Health Benefits

ఢిల్లీ సీఎం,ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిసెంబర్ 20న విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. బుధవారం నుంచి పది రోజుల పాటు కేజ్రీవాల్ విపాసన ధ్యానం కోర్సు చేయనున్నారు.  అంటే..డిసెంబర్‌ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కొన్నాళ్లుగా.. ప్రతి ఏడాది చలికాలంలో  విపాసన ధ్యానానికి వెళుతున్న  విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్‌ వంటి నగరాల్లో  కూడా కేజ్రీవాల్.. ఈ శిక్షణకు హాజరయ్యారు. దీంతో ఏంటీ  విపాసనా ధ్యానం?ఈ ధ్యానం ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

మీ మనస్సును ఒకచోట కేంద్రీకరించడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన అభ్యాసమే.. విపాసన ధ్యానం. నిజానికి విపాసన అంటే ‘అంతర్దృష్టి‘ అనే అర్థం. అంటే విపాసన అభ్యాసం ద్వారా ఒక విషయాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు..మనశ్శాంతిని కూడా సాధించొచ్చు. ఇది చంచలమైన మనస్సును నియంత్రించడంతో పాటు.. మనిషికి  కావాల్సిన ప్రశాంతతను చేకూరుస్తుంది. దీని వల్ల మనం ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించే చేసే స్థితిని మనం పొందుతాం.

అంటే మనిషిని వెంటాడే వివిధ రకాల ఆలోచనలు చుట్టుముట్టకుండా, అంతరంగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వీయ పరిశీలనను మెరుగు పరుచుకోవడానికి ఈ మెడిటేషన్ టెక్నిక్ బాగా పనికొస్తుంది.  బౌద్ధమతంలో ఆచరించే పురాతన ధ్యాన పద్ధతే విపాసన ధ్యానం . అంటే దాదాపు 2,400 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఈ ధ్యానాన్ని గురించి వివరించినట్లు చరిత్ర చెబుతుంది.

విపాసన ధ్యాన అభ్యాసం ఆగ్నేయాసియా, శ్రీలంకలో ఎక్కువ మంది ఆచరిస్తుంటారు. భారతదేశంలో కూడా చాలా చోట్ల విపాసన మెడిటేషన్ కేంద్రాలు ఉన్నాయి.  ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఈ ధ్యానం  సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

విపాసన ధ్యానం  చేయాలంటే..ముందుగా సుఖాసంనలో కూర్చొని నడుం నిటారుగా ఉంచాలి. మెల్లగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. మీ మనో చిత్తంపైనే  దృష్టంతా కేంద్రీకరిస్తూ ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ  ఉండాలి.  ఇది మొదట్లో ఐదు నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తూ.. తర్వాత తర్వాత దాని సమయాన్ని పెంచుతూ 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఉండాలి.

విపాసన ధ్యానంతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అందువల్లే దీనికి  రోజురోజుకు విశేష జనాదరణ పెరుగుతుందని అంటున్నారు. మెరుగైన ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం  సొంతం చేసుకోవడానికి ఈ ధ్యానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ధ్యానం వల్ల కలిగిన లాభాలు తెలిస్తే జన్మలో దీనని వదిలిపెట్టరని నిపుణులు అంటున్నారు. కేజ్రీవాల్ వంటి ప్రముఖులు కూడా విపాసన ధ్యానం చేయడానకి ఇదే కారణం అని చెబుతున్నారు.

విపాసన ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఆందోళనను తగ్గిస్తుంది. మాదక ద్రవ్యాలకు బానిస అయిన వాళ్లను  ఆ అలవాటు నుంచి  బయటపడేలా చేస్తుంది. ఈ అధ్యయనంలో 40 రోజులు ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ టెక్కిక్‌ తీసుకున్న వారిలో ఈ మార్పులన్ని గమనించారు పరిశోధకులు. వారిలో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి ప్రశాంత చిత్తంతో కనిపించారని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 7 =