కరోనా నేపథ్యంలో “ఆస్కార్-2021” వేడుకలు రెండు నెలలు పాటు వాయిదా

93rd Oscars Awards Event, 93rd Oscars Awards Event Postponed, 93rd Oscars Awards Event Postponed by Two Months, Covid-19 Affect, Oscars Awards, Oscars Awards 2020, Oscars Awards Event, Oscars Awards Event Postponed, Oscars Awards Postponed

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డు వేడుకలపై కూడా పడింది. దీంతో 93వ ఆస్కార్ వేడుక‌లు రెండు నెలలపాటుగా వాయిదా పడ్డాయి. ముందుగా 93వ ఆస్కార్ వేడుక‌లను ఫిబ్ర‌వ‌రి 28, 2021 న నిర్వహించాల‌ని అవార్డు క‌మిటీ ఇదివ‌ర‌కే నిర్ణ‌యించింది. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా “ద అకాడ‌మీ మోష‌న్ పిక్చ‌ర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్” వేడుకలను ఏప్రిల్ 25, 2021 వ తేదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వలన సినిమాల విడుదలలు వాయిదా పడుతుండడంతో, ఆస్కార్ అవార్డుల కోసం పోటీప‌డే చిత్రాల అర్హ‌త తేదీని కూడా ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు పొడిగించినట్టు ప్రకటించారు. అలాగే అవార్డులకు నామినేష‌న్లను మార్చి 15న వెల్లడించనున్నట్టు కమిటీ తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − four =