ఢిల్లీలో 150 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడు రోజులు ఉచిత ప్రయాణం

Delhi Chief Minister Arvind Kejriwal Flaged Off 150 Electric AC Buses Today, Chief Minister Arvind Kejriwal Flaged Off 150 Electric AC Buses Today, Arvind Kejriwal Flaged Off 150 Electric AC Buses Today, Delhi Chief Minister Flaged Off 150 Electric AC Buses Today, 150 Electric AC Buses, Arvind Kejriwal flags off 150 electric buses in Delhi, Free Travel In Electric Buses For 3 Days Says Arvind Kejriwal, Delhi CM Flaged Off 150 electric buses, electric buses, Delhi chief minister flagged off 150 Electric AC Buses from the Indraprastha Depot, Indraprastha Depot, Delhi Chief Minister Arvind Kejriwal, Arvind Kejriwal, Delhi Electric AC Buses News, Delhi Electric AC Buses Latest News, Delhi Electric AC Buses Latest Updates, Delhi Electric AC Buses Live Updates, Mango News, Mango News Telugu,

కాలుష్యంపై పోరులో ఢిల్లీ నేడు కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో 150 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేడు 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించగా, వచ్చే నెలలో మరో 150 బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ ఏడాదిలోపు ఇలాంటి 2000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

వచ్చే పదేళ్లలో ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.1862 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇందులో కేంద్రం రూ.150 కోట్లు ఇస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్, పానిక్ బటన్లు, వికలాంగుల కోసం ర్యాంపులు సహా అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. దయచేసి బస్సులను పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులను కోరారు.

అలాగే కొత్తగా ప్రారంభించిన ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో మే 24 నుంచి మే 26 వరకు ఢిల్లీ ప్రజలు మూడు రోజుల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. బస్సుల ప్రారంభోత్సవం అనంతరం ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ తో కలిసి ఇంద్రప్రస్థ డిపో నుండి రాజ్‌ఘాట్ బస్ డిపోకు వెళ్లే బస్సులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =