ఢిల్లీలో ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్, 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం

coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Delhi Corona Vaccine, Delhi Govt, Delhi Govt Dicides to Give Free Corona Vaccine, Delhi Govt Dicides to Give Free Corona Vaccine to All People, Delhi Govt Dicides to Give Free Corona Vaccine to All People Above 18 Years, India Covid Vaccination, Mango News, Vaccine Distribution

దేశంలో మే 1 వతేది నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా వ్యాక్సిన్ ఉచితంగానే ఇవ్వ‌నున్న‌ట్లు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ సోమ‌వారం నాడు ప్రకటించారు. ఈరోజు 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చామని, త్వరలోనే కొనుగోలు చేసి ప్రజలకు త్వరగా అందించేందుకు ప్రయత్నం చేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

మరోవైపు రాష్ట్రాల‌కు అమ్మే కరోనా వ్యాక్సిన్‌ ల ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని వ్యాక్సిన్ తయారీదారులకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్లను ఒక్కో డోసుకు ఒక సంస్థ రాష్ట్రాల‌కు రూ.400కు, మరో సంస్థ రూ.600కు విక్రయిస్తామని ప్రకటించాయి, అయితే కేంద్రానికి మాత్రం రూ.150 కే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంద‌రికీ ఒకే ధ‌ర ఉండేలా చూడాలని తయారీదారులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =