సరైన శిక్షణ లేదని ఇండియాలో 90 మంది స్పైస్‌జెట్ పైలట్లపై నిషేధం.. డీజీసీఏ సంచలన నిర్ణయం

DGCA Bans 90 Spice Jet Pilots From Flying Boeing 737 Max Aircraft in India, Directorate General of Civil Aviation has found 90 SpiceJet pilots unfit to operate the Boeing 737 Max aircraft, Directorate General of Civil Aviation, Directorate General of Civil Aviation Bans 90 Spice Jet Pilots From Flying Boeing 737 Max Aircraft in India, Boeing 737 Max Aircraft in India, Boeing 737 Max Aircraft, Directorate General of Civil Aviation Bans 90 Spice Jet Pilots, DGCA Bans 90 Spice Jet Pilots, DGCA, 90 SpiceJet pilots, SpiceJet pilots News, SpiceJet pilots Latest News, SpiceJet pilots Latest Updates, SpiceJet pilotsLive Updates, Mango News, Mango News Telugu,

భారతీయ విమానాల మరియు పైలట్లకు సంబంధించి ఆపరేటింగ్ మరియు నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ 90 మంది స్పైస్‌జెట్ పైలట్‌లకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సరిగ్గా శిక్షణ ఇవ్వలేదని గుర్తించిన తర్వాత వాటిని నడపకుండా నిషేధించింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ఇండియా ప్రతినిధి ఈరోజు ధృవీకరించారు. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కావడం విశేషం. అడిస్ అబాబా సమీపంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 మ్యాక్స్ విమానం కూలి, నలుగురు భారతీయులతో సహా 157 మంది మరణించిన మూడు రోజుల తర్వాత, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డీజీసీఏ మార్చి 13, 2019న భారతదేశంలో నిలిపివేసింది.

యుఎస్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ విమానంలో అవసరమైన సాఫ్ట్‌వేర్ దిద్దుబాట్లతో డీజీసీఏ సంతృప్తి చెందడంతో గత ఏడాది ఆగస్టులో విమానాలపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే ఈ క్రమంలో డీజీసీఏ షరతులలో సిమ్యులేటర్‌పై పైలట్ సరైన శిక్షణ పొందాల్సి ఉంది. అయితే ఈ 90 మంది పైలట్లలో ఎవరికీ సరైన శిక్షణ లేదని గుర్తించిన తర్వాత ఈ చర్యకు ఉపక్రమించింది. “ప్రస్తుతానికి, మేము ఈ 90 మంది పైలట్‌లను మాక్స్‌ను నడపకుండా బ్యాన్ చేశాము. అయితే వారు ఈ బోయింగ్ విమానాన్ని నడిపేందుకు తిరిగి శిక్షణ పొందాల్సి ఉంటుంది. పైలట్‌లు మ్యాక్స్ సిమ్యులేటర్‌పై సరైన పద్ధతిలో మళ్లీ శిక్షణ పొందవలసి ఉంటుంది. అందులో నెగ్గితే తిరిగి వారికి పర్మిషన్ ఇచ్చే విషయం పునఃపరిశీలిస్తామని” డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ పైలట్లు ఇప్పటివరకు సరైన శిక్షణ లేకుండానే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపటాన్ని రెగ్యులేటరీ బోర్డ్ తీవ్ర విషయంగా భావిస్తోంది. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోనుందని కూడా ఆయన చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =