ఐఆర్‌సీటీసీ ద్వారా హోటల్‌ బుకింగ్‌.. తక్కువ ధరకే చాలా సదుపాయాలు

Do You Know How To Book IRCTC Hotel Retiring Room Facility Process Heres The Details,Do You Know How To Book IRCTC Hotel,IRCTC Hotel Retiring Room Facility,IRCTC Hotel Process Heres The Details,Mango News,Mango News Telugu,Irctc Hotel Booking, Irctc, Hotel Booking,Indian Railway, Train Journey ,Irctc Official Website,IRCTC Hotel Retiring Room Latest News,IRCTC Hotel Retiring Room Latest Updates,IRCTC Latest News and Updates

చాలామంది లాంగ్ జర్నీలంటే రైల్వే ప్రయాణానికే ఓటేస్తారు. చౌకగా , సౌకర్యవంతంగా ప్రయాణికులకు అనుభూతిని ఇవ్వడంలో ఇండియన్ రైల్వే కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం.. ప్రయాణికులకు వివిధ సర్వీసులను అందిస్తున్నాయి. అయితే ఇవి హోటల్‌ బుకింగ్‌ల సదుపాయం కూడా అందిస్తాయని చాలా మందికి తెలియదు.

ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లోనో.. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడో కచ్చితంగా బంధువులు, స్నేహితులు లేని చోట ఉండాల్సి వచ్చినపుడు హోటల్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఏది మంచి హోటలో తెలియక ఇబ్బంది పడతాం. కానీ ఇకపై ఆ ఇబ్బంది వద్దంటుంది భారతీయ రైల్వే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కానీ.. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి మంచి హోటల్ రూమ్‌లను ఎంచక్కా బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ,సింగిల్ నుంచి డబుల్, డార్మెటరీ వంటి ఎన్నో సదుపాయాలను ఇందులో ఎంచుకోవచ్చు. అయితే హోటల్ గదిని బుక్ చేసుకోడానికి ముందు మన దగ్గర మన ప్రయాణపు టికెట్ కలిగి ఉండాలని మాత్రం గుర్తుంచుకోవాలి.

హోటల్‌ బుకింగ్‌ ఎలా చేయాలి?

ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తర్వాత హోమ్‌పేజీలో హోటల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే సిటీ, హోటల్ పేరు, ఏ ప్రాంతంలో కావాలి, చెక్ ఇన్ డేట్, చెక్ అవుట్ డేట్, గదులు, ఎంత మంది ఉంటారు వంటి వివరాలు నమోదు చేసి.. హోటల్‌ను సెర్చ్‌ చేయాలి. తర్వాత కావాల్సిన హోటల్‌ని ఎంచుకోవాలి. నచ్చిన హోటల్ దొరికితే కంటిన్యూ టు బుక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే లాగిన్ ప్రూఫ్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =