బేబీ సూర్యుడు వచ్చేసాడట..

A New Star Like The Sun Is 1000 Light Years Away From Earth,1000 Light Year Wide Bubble,New Star Like The Sun,Sun Is 1000 Light Years Away,Mango News,Mango News Telugu,1000 Light Years Away Sun,Sun Is 1000 Light Years Away From Earth,Sun 1000 Light Years Away From Earth,Sun Light Years Away From Earth,1000 Light Years Away Son From Earth,Revealing The Suns Infant Years,New Sun Found,New Sun Discovered

అంతరిక్షం, విశ్వం అంటేనే ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉంటాయన్న విషయం చిన్నప్పటి నుంచీ చదువుకుంటున్నాం. అందుకే శాస్త్రవేత్తలు కూడా విశ్వం, గ్రహాల ఆవిర్భావం వంటి ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు ఎప్పటి నుంచో నిత్యం శ్రమిస్తూనే ఉంటారు.

నిజానికి ఈ శాస్త్రవేత్తలందరికీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏడాదిగా ..ఎంతో సహాయ పడుతోంది. ఇప్పటికే ఖగోళానికి చెందిన ఎన్నెన్నో ఫోటోలను తీసి పంపిన ఈ భారీ టెలిస్కోప్.. రీసెంట్‌గా మరో అద్భుతమైన ఫోటోను తీసి పంపడంతో శాస్త్రవేత్తలు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే సూర్యుడి లాంటి కొత్త నక్షత్రం ఫొటోను వెబ్ టెలిస్కోప్ తీసి పంపడంతో బేబీ సూర్యుడిలా కనిపిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడిలా కనిపిస్తున్న.. కొత్తగా నక్షత్రం ఏర్పడుతున్న ఫోటోను తీసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భూమిపైకి పంపించింది. ఈ ఫోటో సూర్యుడు పుట్టిన సమయంలో ఎలా ఉండేదో తెలుపుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం సూర్యుడిని పోలిన ఈ నక్షత్రం ఇప్పటికీ ఏర్పడే తొలి దశలోనే ఉందని అంటున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కాంతి సూపర్ సోనిక్ వేగంతో చీలిపోతున్న దృశ్యాన్ని కూడా బంధించడంతో.. నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియతో పాటు సూర్యుడి గురించి కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో నాసా తాజాగా పోస్ట్ చేసింది. కొత్తగా ఏర్పడే ఈ నక్షత్రం చుట్టూ కనపించే కాంతిని హెర్బీస్ హాలో అంటారని నాసా చెప్పింది. ఈ కొత్త నక్షత్రం భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలోనే ఉందని తెలిపింది.అంతేకాదు.. మన సూర్యుడు పుట్టిన సమయంలో కనుక ఫోటో తీస్తే.. అది అచ్చంగా ఇలాగే ఉండేందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ ఫోటోలో కొత్తగా పుట్టిన నక్షత్రం స్పష్టంగా కనిపిస్తుండగా .. దాని నుంచి పోల్ గ్యాస్ సూపర్ సోనిక్ వేగంతో దూరంగా విసిరేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ కొత్త నక్షత్రం వయసు.. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కాలం గడిచే కొద్ది ఇది సూర్యుడిలా మారుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త నక్షత్రం నుంచి రెండు వైపులా దూసుకెళ్లిన వాయవు చుట్టూ ఉండే గ్యాస్, ధూళితో ఢీకొని హెర్బీస్ హాలోగా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త నక్షత్రం బరువు.. ప్రస్తుతం మన సూర్యుడి బరువులో 8 శాతం మాత్రమే ఉంటుందని.. తర్వాత మెల్లగా సూర్యుడి ఆకృతిలో మారుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు

మరోవైపు జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను నాసా 2021 సంవత్సరంలో నింగిలోకి పంపింది. 2022 సంవత్సరం నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన పనిని చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నో గెలాక్సీలకు సంబంధించిన ఫోటోలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసి భూమిపైకి పంపింది.అయితే తాజాగా పంపిన బుల్లి సూర్యుడి ఫోటో నాసా శాస్త్రవేత్తలకు సరికొత్త జోష్‌ను నింపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =