ఆ దేశాల్లోని ప్రజలు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదట..

Do You Know About Tax Free Countries in The World,Do You Know About Tax Free Countries,Tax Free Countries,Tax Free Countries in The World,Mango News,Mango News Telugu,Income tax system, A source of income, Income above a certain amount, land tax,Tax Free Countries 2023,Countries Without Income Taxes,Countries with no income tax,Tax Free Countries News Today,Tax Free Countries Latest News,Tax Free Countries Latest Updates,Tax Free Countries Live News,Tax Free Countries Live Updates

మన దేశానికి, రాష్ట్రాలకు ఆదాయపు పన్ను ప్రధాన సోర్సుగా ఉండి ప్రభుత్వాలకు భారీ ఆదాయమే వచ్చి చేరుతూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ అన్న పదమే వినిపించదు. పన్ను వసూళ్లు అసలు ఉండనే ఉండవు.

చాలా దేశాలు ఆదాయపు పన్ను సిస్టమ్‌ను కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని దేశాలు ఆ విధానాన్ని అమలు చేయడం లేదు. నిజం చెప్పాలంటే ఇన్‌కమ్ ట్యాక్స్ వసూళ్లు అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన ఇన్‌కమ్ సోర్సుగా ఆర్ధిక నిపుణులు చెబుతారు. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నవారంతా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే.. అంత ఎక్కువగా ప్రభుత్వాలకు ఆదాయపు పన్ను చెల్లించాలి. దీంతో పాటు అదనంగా రోడ్డు ట్యాక్స్ వంటి ఎక్స్‌ట్రా పన్నులు కూడా చెల్లించాలి. కొన్ని దేశాల్లో మాత్రం ఆదాయపు పన్ను కానీ, ఇతర పన్నులు కానీ కట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆ దేశాలలో కావలసినంత ఆదాయాన్ని సంపాదించవచ్చట. మరి ప్రభుత్వాలకు ప్రధాన వనరు ఆదాయపు పన్నే అయినప్పుడు ఆ ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా ఆ దేశాలు ఎలా తమ దేశాన్ని అభివృద్ది పరుచుకుంటాయని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ నగదుతోనే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ దేశ అభివృద్ధి కుంటుపడదా అన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి.

నిజమే మొనాకో, బెర్ముడా వంటి దేశాలకు పన్నుతో ఇన్‌కమ్ ట్యాక్స్ తో పనిలేదు. ఆ దేశాలు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతాయి. ఇలా ఇతర మార్గాలలో ఆదాయాన్ని పొందే దేశాలలో బహామాస్ ఒకటి. అమెరికాకు ఆనుకుని ఉన్న కరేబియన్ దీవుల సమూహం బహమాస్‌ గా పిలుస్తారు. ఇక్కడ ఆదాయపు పన్ను ఉండదు. అయితే, కొన్ని షరతులు ఉన్నాయి. ఇక ఎవరైనా ఈ దేశంలో 90 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే.. వారికి శాశ్వత నివాస హక్కు కూడా వస్తుంది. శాశ్వత నివాసితులు ఇక్కడ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అలాగే మొనాకో గురించి కూడా చెప్పుకోవాలి. ఐరోపాలోని మొనాకో.. ధనవంతులకు విలాసవంతమైన ప్రదేశంగా చెబుతారు. ఇది భూమిపైనే అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ, చాలా ఖరీదైన ప్రదేశం. ఇక్కడ నివసించాలంటే మూడు నెలల్లో 5 లక్షల యూరోలు చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ దేశానికి ఇన్‌కమ్ ట్యాక్స్ కంటే టూరిస్టుల ద్వారా వచ్చే డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది.

ఇక ఈ లిస్టులో యూఏఈ కూడా ఉంది. దుబాయ్, షార్జా, అబుదాబిలను కలిగి ఉన్న యూఏఈలో ఆదాయపు పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు. యూఏఈ మాత్రమే కాదు, చాలా గల్ఫ్ దేశాల్లో ఇలాంటి ఏ పన్నులు లేవు.

ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది బెర్ముడా గురించి. బెర్ముడా అత్యంత ఖరీదైన కరేబియన్ దేశాలలో ఒకటిగా చెబుతారు. బీచ్‌లకు బాగా ప్రసిద్ధి చెందిన బెర్ముడాలో చాలా లగ్జరీ రెస్టారెంట్లు ఉంటాయి. ఇక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. అయితే, ఇది కంపెనీలపై పేరోల్ ట్యాక్స్ విధిస్తుంది. ఆస్తి యజమానులు, రెంట్ కు ఉండేవారికి ల్యాండ్ ట్యాక్స్ విధిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =