ఐశ్వర్యారాయ్‌కు స‌మ‌న్లు పంపిన ఈడీ

Actress Aishwarya Rai Bachchan, Actress Aishwarya Rai Bachchan in Panama Papers Leak Case, Aishwarya Rai, Aishwarya Rai Bachchan, Bachchan, Bollywood Actress Aishwarya Rai Bachchan, ED Issued Summons to Bollywood Actress Aishwarya Rai Bachchan, ED Issued Summons to Bollywood Actress Aishwarya Rai Bachchan in Panama Papers Leak Case, ED summons Aishwarya Rai Bachchan, ED summons Aishwarya Rai Bachchan in Panama Papers case, ED summons Aishwarya Rai in Panama Papers leaks case, Mango News, Panama Papers Case, Panama Papers Leak, Panama Papers Leak Case, Summons to Bollywood Actress Aishwarya Rai Bachchan

ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఈ రోజు తమ ఎదుట విచార‌ణ‌కు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. పన్నులు ఎగవేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్‌లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ నిమిత్తం, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఐశ్వర్యారాయ్ కు ఈడీ అధికారులు సమన్లు ​​జారీ చేశారు. అయితే, తాను ఈ రోజు విచార‌ణ‌కు రాలేన‌ని, విచార‌ణ‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని ఐశ్వ‌ర్యా రాయ్ ఈడీని కోరిన‌ట్లు తెలిసింది. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది.

కాగా, ఐదేళ్ల క్రితం నాటి ఈ పనామా పేపర్స్ లీకేజీ కేసు గత కొంతకాలంగా విచారణలో ఉంది. పనామా పేపర్ల ద్వారా బ‌య‌ట‌ప‌డిన వారిపై సుదీర్ఘ‌ విచారణ కొన‌సాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్స్ కేసులో భారత్‌కు చెందిన దాదాపు 500 మంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈడీ అధికారులు విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను చేర్చారు. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌ను కూడా పిలిపించి విచారించారు. అప్పుడు అభిషేక్ బచ్చన్‌ కొన్ని పత్రాలు సమర్పించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం ఐశ్వర్యరాయ్‌కి సమన్లు ​​అందినట్లు తెలుస్తోంది. కాగా, ఐశ్వ‌ర్యా రాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ గ‌తంలోనూ స‌మ‌న్లు జారీ చేయ‌గా, ఆమె రెండు సార్లు విచార‌ణ తేదీల‌ను మార్చాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. ఇక ఐశ్వ‌ర్యా రాయ్‌ను ఏయే ప్ర‌శ్న‌లు అడ‌గాల‌న్న అంశంపై ఈడీ అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ప‌నామా కేసులో ఐశ్వ‌ర్య‌ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసుకోనుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం కూడా ప‌నామా కేసులో విచార‌ణ ఎదుర్కొంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + five =