నా ఉద్యోగం వల్ల సమాజానికి ఉపయోగం ఉందా? 32శాతం మంది ఉద్యోగులు ఇలాగే భావిస్తున్నారట!

Gartner HR Research Finds 32% of Employees Feels Like Is My Job is Useful To the Society,Gartner HR Research Finds 32% of Employees,32% of Employees Feels Like Is My Job is Useful,Is My Job is Useful To the Society,Gartner HR Research,HR Research,Mango News,Mango News Telugu,job useful to society,Is my job useful to society, 32 percent employees feel the same,employees, Business, Sales and Management,Gartner HR Research News Today,Gartner HR Research Latest News,Gartner HR Research Latest Updates

ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం వల్ల సొసైటీకి ఏం ఉపయోగం అన్న భావనలోనే ఎక్కువమంది ఉద్యోగులు ఉంటున్నారట. నేను అర్ధం లేని జాబ్ చేస్తున్నానా అని అనుమానాలకు లోనవుతున్నారట. అవును ప్రపంచ వ్యాప్తంగా 32శాతం మంది ఇలాగే అనుకుంటున్నారని.. సందర్భం వచ్చినప్పుడు తమ సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారని యూనివర్శిటీ ఆఫ్ జూరిచ్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు.

కొన్ని రంగాలలో వారయితే ఈ సమస్యతో బీభత్సంగా ఫీలవుతున్నారట. ఇలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ వల్ల వారి వారి రంగాలలో బాగా ఎదగాల్సినవాళ్లు కూడా వెనుకబడిపోతున్నారట. ముఖ్యంగా సేల్స్ అండ్ మేనేజ్ మెంట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, ఫైనాన్సియల్ రంగంలో జాబ్ చేసే ఎంప్లాయిస్ తన ప్రొఫెషన్ వల్ల , తనుజాబ్ చేయడం వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదని నమ్ముతున్నారట. మెయిన్‌గా స్పానిష్, సేల్స్ అండ్ మేనేజ్మెంట్ సంస్థలలో ఆ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో ఈ ధోరణి ఎక్కువ అయిందని డేవిడ్ గ్రేబెర్ అనే అమెరికన్ ఆంత్రోపాలాజిస్ట్ డెవలప్ చేసిన బీఎస్ జాబ్స్ థియరీ నివేదికలో చెప్పబడింది.

ఉద్యోగులు తమ వృత్తి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారా.. రొటీన్ గా చేస్తున్నారా.. లేక ఇబ్బందులు పడుతున్నారా అని తెలుసుకునే ఉద్దేశంతో యూఎస్‌ కేంద్రంగా.. 21 రంగాలకు చెందిన 1,811 మందికి సంబంధించిన సర్వే డేటాను పరిశోధకులు బాగా ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా తాము ఉద్యోగంలో చేస్తున్న పని.. సొసైటీ అండ్ కమ్యూనిటీపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ఉద్యోగులు ఫీలవుతున్నారో వాళ్లు పరిశీలించారు. వీరిలో కేవలం 19 శాతం మంది మాత్రమే తాము చేస్తున్న జాబ్‌వల్ల తనతో పాటు తన కుటుంబం అలాగే ఏదొక రూపంలో సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారట.
ఇక 32 శాతం మంది మాత్రం తాము చేస్తున్న జాబ్స్‌ను చాలా రొటీన్‌గా భావిస్తున్నారట. పైగా ఇలాంటి ఉద్యోగం వల్ల సమాజానికి ఎటువంటి సర్వీస్ చేయడానికి కుదరదని దీనివల్ల తాము చేస్తున్న ఉద్యోగం వల్ల సొసైటీకి ఎటువంటి ప్రయోజనం కూడా లేదని ఫీలవుతున్నారట.

కొందరు వ్యక్తులు ఉద్యోగంలోని ఒత్తిడి, పని స్ట్రెస్, వర్కులో ఉండే అంతర్లీన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ కంప్లైట్స్, డైలీ ఒకేలాంటి దినచర్య, ఎదుగుదల లేకపోవడం, పూర్ మేనేజ్మెంట్ వంటి అంశాలను లెక్క పెట్టి తమ ఉద్యోగాలు ఏమాత్రం అర్ధం లేనివని భావిస్తున్నారట. బిజినెస్, సేల్స్ అండ్ మేనేజ్ మెంట్ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులు.. మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా తమ ఉద్యోగం.. సమాజానికి ఎందుకూ పనికి రాదని భావిస్తున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో చెప్పారు. వీరి తర్వాతి స్థానంలో ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ మేనేజర్స్ కూడా అనుకుంటున్నారని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =