కర్ణాటకలో తెరుచుకున్న ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు.. ‘హిజాబ్‌’ వివాదంపై స్టూడెంట్స్ ఆందోళనలు

Karnataka Muslim Student File Writ Petition With HC Over Hijab Row Says It's Her Fundamental Rights, A writ petition has been filed in the Karnataka High Court by a Muslim girl student, A writ petition has been filed in the Karnataka High Court, A writ petition, Muslim Student File Writ Petition With HC Over Hijab Row, Fundamental Rights, Wearing Hijab Row Is Fundamental Right Says Muslim Student, Karnataka, Karnataka Latest News, Karnataka Latest Updates, Hijab Row, Muslim Student moves HC against ban on hijab in college, Karnataka High Court, Mango News, Hijab Row in Karnataka, A writ petition has been filed in the Karnataka High Court By A Muslim Student,

కర్ణాటక ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ‘హిజాబ్‌’ వివాదంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు ఈరోజు (బుధవారం) తిరిగి తెరుచుకున్నాయి. అయితే, బురఖా ధరించిన ముస్లిం విద్యార్థినులను లోనికి అనుమతించకపోవడంతో కర్ణాటకలోని అనేక ప్రీ-యూనివర్శిటీ కళాశాలల్లో బుధవారం గందరగోళం నెలకొంది. దీంతో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో.. అనేక సున్నితమైన ప్రదేశాలలో ఉన్న ప్రీ-యూనివర్సిటీ కళాశాలల చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

అయితే, హిజాబ్‌ వ్యవహారంపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును కచ్చితంగా అమలు చేస్తామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు బుధవారం నాలుగో రోజు విచారణ ప్రారంభించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, ప్రొఫెసర్ రవివర్మ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కర్ణాటక విద్యా చట్టాన్ని ప్రస్తావించారు. విద్యాసంస్థ యూనిఫాం మార్చుకోవాలనుకున్నప్పుడు, తల్లిదండ్రులకు ఒక సంవత్సరం ముందుగానే నోటీసు జారీ చేయాలని నియమావళి తెలియజేస్తుందని న్యాయవాది చెప్పారు.

“హిజాబ్‌పై నిషేధం ఉంటే, అది ఒక సంవత్సరం ముందుగానే తెలియజేయాలి” అని కుమార్ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నాయని అన్నారు. హిందూ అమ్మాయిలు కంకణాలు ధరించి, క్రిస్టియన్ అమ్మాయిలను క్రాస్ ధరించిన వారిని బయటకు పంపలేదు. అయినా, హిజాబ్‌పై ఎటువంటి నిషేధం లేదు. కానీ, ప్రభుత్వం హిజాబ్‌ను మాత్రమే ఎంచుకొని దీనిని విద్వేషపూరిత వివక్షగా ఎందుకు చూస్తోందని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =