ఢిల్లీ మేయ‌ర్ ఎన్నికలో హైడ్రామా.. సివిక్ సెంటర్‌లో ఆప్, బీజేపీ కార్పొరేట‌ర్ల మధ్య తీవ్ర ఘర్షణ

Delhi Mayor Elections AAP and BJP Councillors Clash with Each Other at Civic Centre,Delhi Mayor Elections,Delhi Elections AAP,Delhi Elections BJP,Civic Centre,Mango News,Mango News Telugu,Delhi Municipal Corporation Election,MCD Election,MCD Election Latest News and Updates,Election Comission Delhi,Delhi Election Comission,MCD Election 2022,Delhi MCD Poll 2022,Delhi MCD Poll Live Update,Delhi MCD Poll Result Date,Delhi Municipal Election Results-2022,Delhi Municipal Election Results,Delhi Municipal Election Results 2022,Aam Aadmi Party lead over BJP,Aam Aadmi Party,BJP

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ (ఎంసీడీ) స‌మావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. శుక్రవారం సివిక్ సెంటర్‌లో సమావేశమైన ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీ కార్పొరేట‌ర్లు ఒకరిపై ఒకరు దాడుల‌కు పాల్ప‌డ్డారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ఎంసీడీ తాత్కాలిక స్పీక‌ర్‌గా స‌త్య శ‌ర్మ‌ను అపాయింట్ చేయడంతో ఆయన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆప్ స‌భ్యులు నినాదాలు చేశారు. ప్రోటెమ్ స్పీకర్‌గా ఆప్ అభ్యర్థి ముఖేశ్ గోయల్‌ను కాదని బీజేపీకి చెందిన సత్య శర్మను ఎలా నియమిస్తారంటూ సభలో గొడవకు దిగారు. ఈ క్రమంలో స్పీక‌ర్ ముందుగా నామినేట్ స‌భ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దీంతో అభ్యంతరం తెలిపిన ఆప్ పార్టీ, నామినేట్ స‌భ్యుల కంటే ముందు ఎన్నికైన స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయించాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్పొరేట‌ర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. బల్లలపై పైకి ఎక్కి ఒకరినొకరు తోసుకోవడంతో హౌస్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మేయర్‌ ఎన్నిక కోసం జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eight =