ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌ కు తేదీలు ఖరారు, ఎప్పుడంటే?

ICC World Test Championship 2023 Final Dates Confirmed,ICC World Test Championship,ICC World Test Championship 2023,World Test Championship 2023,Mango News,Mango News Telugu,Icc Test Championship Points Table 2023,World Test Championship 2023 Final Venue,World Test Championship Points Table,World Test Championship Schedule,Icc Test Ranking,World Test Championship Final Date,Icc World Test Championship 2023 Points Table,Icc World Test Championship 2023 Schedule,Icc World Test Championship 2023-25,Icc World Test Championship 2023 To 2025,Icc World Test Championship India Schedule 2021 To 2023,Icc World Test Championship Most Runs 2021 To 2023,Icc World Test Championship Schedule 2021 To 2023,Icc Test Championship Schedule 2023

ఈ ఏడాది ఓవల్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ నిర్వహణకు తేదీలు నిర్ధారించబడ్డాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023/రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుండి 11 వరకు లండన్‌ లోని ఓవల్‌ స్టేడియంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. సౌతాంప్టన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2021 ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకుంది.

కాగా ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 సైకిల్/సీజన్ 2021, జూలై నుండి 2023 జూన్ వరకు నడువనున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి తొమ్మిది టెస్ట్ జట్లు పాల్గొంటుండగా, ఒక్కొక్కటి ఆరు సిరీస్‌లను (మూడు స్వదేశంలో మరియు మూడు బయట) ఆడుతున్నాయి. ఈ సీజన్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌లో తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ రేసులో ఆస్ట్రేలియా 75.56 పర్సెంటేజ్ తో (136 పాయింట్స్) మొదటి స్థానంలో, భారత్ జట్టు 58.93 పర్సెంటేజ్ తో (99 పాయింట్స్) రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 9 నుండి నాగ్‌పూర్‌ లో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగు-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ తుది ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనలిస్టులను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ప్రస్తుత టేబుల్ వివరాలు:

1.ఆస్ట్రేలియా – 75.56 పర్సెంటేజ్- 136 పాయింట్స్
2. భారత్ – 58.93 పర్సెంటేజ్ – 99 పాయింట్స్
3. శ్రీలంక – 53.33 పర్సెంటేజ్ – 64 పాయింట్స్
4. సౌతాఫ్రికా – 48.72 పర్సెంటేజ్ – 76 పాయింట్స్
5. ఇంగ్లాండ్ – 46.97 పర్సెంటేజ్ – 124 పాయింట్స్
6. వెస్టిండీస్ – 40.91 పర్సెంటేజ్ – 54 పాయింట్స్
7. పాకిస్తాన్ – 38.1 పర్సెంటేజ్ – 64 పాయింట్స్
8. న్యూజిలాండ్ – 27.27 పర్సెంటేజ్ – 36 పాయింట్స్
9. బంగ్లాదేశ్ – 11.11 పర్సెంటేజ్ – 16 పాయింట్స్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =