దేశంలో ఒక్కరోజే 8 లక్షలు పైగా కరోనా పరీక్షలు, 2.68 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో భారత్ మరో మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,30,391 కరోనా పరీక్షలను నిర్వహించారు. “టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్” వ్యూహాన్ని అనుసరించి, రోజుకు 10 లక్షల పరీక్షల పరీక్షా సామర్థ్యాన్ని చేరుకోవడానికి దేశంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 2,68,45,688 కు పెరిగింది. మిలియన్ జనాభాకు 19453 పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అలాగే దేశంలో పరీక్షల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 947 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 468 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1433 అయింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =