మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారలేదు.. అంతలోనే మరో కొత్త సమస్య

Manipur Conflict Threatens That Raised New Problems Regarding Food Supplies,Manipur Conflict Threatens,Manipur Threatens That Raised New Problems,New Problems Regarding Food Supplies,Manipur Conflict,Mango News,Mango News Telugu,food crisis IN MANIPUR, MANIPUR, MANIPUR violence, Another New Problem In Manipur,Another new problem In Manipur, food crisis IN MANIPUR, Manipur, MANIPUR violence,Manipur Latest News,Manipur Latest Updates,Manipur violence News Today,Manipur violence Live Updates

మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.

మే 3వ తేదీన మణిపూర్‌లో మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి 160 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్. రాజకీయ జోక్యం కూడా పని చేయట్లేదు. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం.. అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.

ఈ పరిస్థితుల్లో ఉన్న మణిపూర్‌లో మరో కొత్త సమస్య పుట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. క్రమంగా అక్కడ ఆహార సంక్షోభం నెలకొంటోంది. వ్యవసాయ పనులు అక్కడ స్తంభించిపోయాయి. మెజారిటీ గ్రామాలన్నీ కూడా నిరంతర కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు, పోలీసుల పహారాలో ఉంటున్నాయి. స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. స్వేచ్ఛగా తిరుగలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం వ్యవసాయ పనులపై పడింది. మణిపూర్ గ్రామాల్లో వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు పొలం పనులకు వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతున్నప్పటికీ.. అరక దున్నడానికి మణిపూర్ రైతులు సాహసించలేకపోతున్నారు.

మణిపూర్ వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 149 గ్రామాల్లో కనీసం 5,127 హెక్టార్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. వ్యవసాయ పనులు స్తంభించిపోవడం వల్ల జూన్‌ వరకు 15,437 మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి నిలిచిపోయింది. బిష్ణుపూర్ జిల్లాలో 2,191 హెక్టార్ల భూమి సాగుకు నోచుకోలేదు.

ఈ పరిస్థితులను సమీక్షించడానికి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల కోసం విత్తనాలు, ఎరువులు, సాగునీటి వసతి, విద్యుత్ సరఫరా.. ఇలా అన్నీ అందుబాటులో ఉంచినప్పటికీ.. రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో దిగడానికి భయపడుతున్నారని పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =