దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోంది, దీనిపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి – పార్ల‌మెంట్‌లో రాహుల్ గాంధీ

Parliament Budget Session Congress MP Rahul Gandhi Questions PM Modi Over Adani Group Issue,Parliament Budget Session,Congress MP Rahul Gandhi,Questions PM Modi,Adani Group Issue,Mango News,Mango News Telugu,Adani Group Companies,Adani Gas Share Price,Adani Career,Adani Cement,Adani Electricity,Adani Electricity Bill,Adani Electricity Bill Payment,Adani Enterprises,Adani Enterprises Share Price,Adani Gas,Adani Green Share Price,Adani One,Adani Port Share Price,Adani Power,Adani Power Share Price,Adani Wilmar Share Price,Gautam Adani,Gautam Adani Net Worth

దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్ల‌మెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు. ఇటీవలే భారత్ జోడో యాత్రను ముగించుకుని వచ్చిన ఆయన ఈరోజు నుంచి సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీని అదానీ గ్రూప్ వివాదంపై పలు ప్రశ్నలు సంధించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.

పార్ల‌మెంట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..

  • గౌతమ్ అదానీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
  • అనతికాలంలోనే వ్యాపారవేత్త అదానీ ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్లకు ఎలా పెరిగాయి?
  • వివిధ వ్యాపారాలలోకి అదానీ గ్రూప్ అనుమతించడానికి ప్రభుత్వ నియమాలు ఎందుకు మార్చబడ్డాయి?
  • తమిళనాడు మరియు కేరళ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు, మేము ప్రతిచోటా ‘అదానీ’ అనే పేరు వింటున్నాము.
  • అదానీ ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశిస్తే ఎప్పుడూ విఫలం కాలేదా? అని ప్రజలు నన్ను అడిగేవారు.
  • 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసే బాధ్యతను కేవలం ఒక కంపెనీ/వ్యక్తికి మాత్రమే అప్పగించాలనే నిబంధనను మార్చి, ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించారు ఎందుకు?
  • మీరు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశారు?
  • మీ పర్యటనల తర్వాత అదానీ విదేశాల్లో ఎన్నిసార్లు కాంట్రాక్టు పొందారు?
  • గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత డబ్బు డొనేట్ ఇచ్చారు?

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =