పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం, డిసెంబర్ 29 వరకు నిర్వహణ

Parliament Winter Session Begins from Today Continues till December 29th,Parliament Winter Session,Telangana Cabinet Meeting,TS Cabinet Meeting,KCR Cabinet Meeting,Mango News,Mango News Telugu,Parliament Winter Session Latest News and Updates,TRS Party MP's News and Live Updates,TRS Party,CM KCR,Telangana CM KCR,Telangana Chief Minister,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,winter session of Parliament,winter Parliament session

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం (డిసెంబర్ 7, బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్‌ 29 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి మొత్తం 17 పనిదినాల్లో సమావేశాలు జరుగనున్నాయి. లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించగా, రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన తరువాత మొదటగా, ఇటీవల మరణించిన సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణ సహా మరో ఆరుగురికి మాజీ సభ్యులకు నివాళులు అర్పించారు. అనంతరం లోక్‌సభ కార్యకలాపాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

ఇక బుధవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా మరియు బాధ్యతతో సాధించడంలో మన పార్లమెంట్ ప్రపంచానికి టార్చ్ బేరర్ అవుతుందన్నారు. రాజ్యసభ దేశానికి అతిపెద్ద బలమని, మన ప్రధానమంత్రుల్లో చాలా మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని అన్నారు. మరోవైపు తొలిసారిగా రాజ్యసభ ఛైర్మన్‌గా సభను నడుపుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారని ప్రధాని అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రైతు బిడ్డ అని మరియు అతను సైనిక్ పాఠశాలలో చదువుకున్నాడని, అందువల్ల జవాన్లు మరియు కిసాన్‌లతో అతను సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని ప్రధాని పేర్కొన్నారు. న్యాయవాదిగా మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ధన్కర్ కు న్యాయపరమైన విషయాలపై గొప్ప పరిజ్ఞానం ఉందని అన్నారు. మరోవైపు భారతదేశం ‘అమృత్ కాల్’ ప్రయాణాన్ని ప్రారంభించి, జీ-20 అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన తరుణంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ శీతాకాల సమావేశాల్లో 25 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో 16 బిల్లులు కొత్తవి కాగా, ఏడు పెండింగ్‌లో ఉన్నవి, మరో రెండు ఆర్థిక బిల్లులు ఉన్నాయి. అలాగే నియంత్రణలో లేని ద్రవ్యోల్బణం, చైనా సరిహద్దు చొరబాటు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, దేశంలో నిరుద్యోగం పెరుగుదల, రైతులకు కనీస మద్దతు ధర, ఇటీవల ఏయిమ్స్ పై సైబర్ దాడి, రూపాయి పడిపోవడం సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =