తెలంగాణలో క్యాపిటల్యాండ్‌ రూ.6,200 కోట్ల పెట్టుబడి, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ

Capita Land Announces Investment of Rs 6200 Cr in Telangana Signed MoU in Presence of Minister KTR,CapitaLand,Capita Land Investment,Capita Land Telangana Investment,Mango News,Mango News Telugu,Memorandum Of Understanding,Minister KTR,Capita Land MoU For KTR,Minister KTR Latest News and Updates,CapitaLand India,CapitaLand India News and Live Updates,Capitaland To Invest 6200 Cr,CLINT Signs MoU,Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ (సీఎల్‌ఐఎన్‌టీ) సంస్థ రాష్ట్రంలో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం, సీఎల్‌ఐఎన్‌టీ ఒక అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకం చేశాయి. దీని ద్వారా ముందుగా మాదాపూర్‌లో రూ.1200 కోట్ల పెట్టుబడితో 36 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్‌ను సీఎల్‌ఐఎన్‌టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. 2,50,000 చదరపు అడుగుల డేటా సెంటర్ 2024 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది.

అలాగే సీఎల్‌ఐఎన్‌టీ సంస్థకు హైదరాబాద్‌లో దాదాపు 6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత ఆఫీస్ స్పేస్‌ను రాబోయే 5 సంవత్సరాలలో రూ.5000 కోట్ల పెట్టుబడితో రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. క్యాపిటల్యాండ్‌ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉండగా, ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ గ్రూపులలో ఒకటిగా క్యాపిటల్యాండ్‌ గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎల్‌ఐఎన్‌టీ సీఈవో సంజీవ్ దాస్‌గుప్తా, క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సీఈవో పాట్రిక్ బూకాక్, తదితరులు పాల్గొన్నారు.

ఈ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, క్యాపిటల్యాండ్ రూ.1200 కోట్లతో హైదరాబాద్‌ లో 36 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతున్నదని మరియు 2024 చివరి నాటికి అభివృద్ధి చేసి, అమలు చేయబడుతుందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం ఎంఓయూపై సంతకాలు జరిగాయన్నారు. అలాగే రాబోయే 5-7 సంవత్సరాలలో రూ.5000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో క్యాపిటల్యాండ్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయ స్థలాన్ని రెట్టింపు చేస్తుందని తెలుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నగరంలో వారి ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 15 =