పశ్చిమబెంగాల్‌ పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ, కరోనా పరిస్థితిపై సమీక్షలు

Covid second wave PM Modi in action mode, Mango News, Modi will Chair high-level Meetings on COVID-19 Situation, PM cancels West Bengal tour due to high-level meetings, PM Modi, PM Modi calls off West Bengal visit, PM Modi cancels campaign visit to Bengal, PM Modi Cancels Tomorrow West Bengal Visit, PM Modi cancels tomorrow’s Bengal visit, PM Modi cancels trip to West Bengal tomorrow, PM Modi Cancels West Bengal Visit, West Bengal Assembly Elections 2021, West Bengal Elections, West Bengal Elections 2021

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు చేపట్టాల్సిన పశ్చిమబెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని సమీక్షించడానికి రేపు ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్నాను. ఆ కారణంగా పశ్చిమబెంగాల్ ‌కు వెళ్లడం లేదు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముందుగా బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి శుక్రవారం నాడు 4 ర్యాలీలలో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది, కాగా కరోనాపై సమీక్షలు కారణంగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు వర్చువల్ మాధ్యమం ద్వారా పశ్చిమబెంగాల్ ప్రజలతో ప్రధాని మోదీ మాట్లాడనున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు శుక్రవారం ఉదయం 9 గంటలకు కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ అంతర్గత సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం కరోనావ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు దేశంలోని ప్రముఖ ఆక్సిజన్ తయారీదారులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రాలకు, ఉన్నతాధికారులకు పలు అంశాలపై కీలక సూచనలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =