దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

covid vaccine below 18 years in india, covid vaccine below 18 years registration, COVID-19 India Updates, COVID-19 Vaccination, Covid-19 vaccination drive for 15-18 age group begins, COVID-19 Vaccination Drive For Children, COVID-19 Vaccination Drive For Children Begins I, COVID-19 Vaccination Drive For Children Begins In India, COVID-19 Vaccination Drive For Children Begins In India Today, COVID-19 Vaccination Drives For Children, India begins vaccination drive for 15-18 age group, Mango News, Omicron, vaccination age limit in india, Vaccination Drive For Children Begins In India, Vaccination Drives For Children, Vaccination of children aged between 15 and 18 begins

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా, జనవరి 3, 2022 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 15-18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి నమోదు ప్రక్రియ జనవరి 1న ప్రారంభం కాగా, ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకునట్టు తెలిపారు. ఈ కేటగిరి కోసం వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాక్జిన్” వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది.

కోవిన్ పోర్టల్‌లో నమోదు లేదా వాక్-ఇన్ రిజిస్ట్రేషన్‌, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ పొందవచ్చని తెలిపారు. 15-18 సంవత్సరాల వారు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఇతర నేషనల్ గుర్తింపు కార్డులతో పాటుగా స్టూడెంట్ ఐడీ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వీరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. 2007 లేదా అంతకు ముందు పుట్టిన పిల్లలు 15-18 ఏళ్ల కేటగిరీ కింద వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని తెలిపారు. ప్రతికూల ప్రభావాన్ని పర్యవేక్షించే నేపథ్యంలో వీరు వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తప్పకుండా అరగంట పాటు వేచి ఉండాలని పేర్కొన్నారు. ఇక 15-18 సంవత్సరాల వారికి కోవాక్జిన్ వ్యాక్సిన్ యొక్క రెండవ డోస్ ను మొదటి తీసుకున్న 28 రోజుల తర్వాత ఇవ్వబడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =