గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ

foundation Stone for Multiple Projects in Somnath Temple, Mango News, Modi Inaugurates and Lays foundation Stone of Multiple Projects in Somnath Temple, Multiple Projects in Somnath Temple, PM Modi, PM Modi lays foundation stone for Parvati temple, pm narendra modi, PM Narendra Modi Inaugurates and Lays foundation Stone of Multiple Projects, PM Narendra Modi Inaugurates and Lays foundation Stone of Multiple Projects in Somnath Temple, Somnath Temple, Somnath Temple News, Somnath Temple PM Modi, Somnath Temple Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ఎగ్జిబీషన్ సెంటర్, పునర్నిర్మాణం జరిగిన పాత సోమనాథ్ (జూనా) ఆలయం ఆవరణ, సోమనాథ్ ప్రొమెనేడ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే శ్రీ పార్వతి ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనేడ్ ను పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ ఆగుమెంటేషన్ డ్రైవ్ లో భాగంగా 47 కోట్ల రూపాయలపై చిలుకు వ్యయంతో అభివృద్ది చేశారు. ఇక శ్రీ పార్వతీ దేవాలయాన్ని 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపాని, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ,  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ ప్రాచీన కీర్తి పునరుజ్జీవనం కోసం ఎంతో సంకల్ప శక్తిని చూపించిన సర్దార్ పటేల్‌ కు నమస్కరించారు. విశ్వనాథ్ నుండి సోమనాథ్ వరకు అనేక దేవాలయాలను పునరుద్ధరించిన లోకమాత అహిల్యాబాయ్ హోల్కర్‌ను గుర్తు చేసుకున్నారు. పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయలను కల్పించడంతో స్థానిక ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా దేశం ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. విధ్వంసక శక్తులు భీభత్సం ఆధారంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించే ఆలోచన చేసినపుడు తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించవచ్చు కానీ దాని ఉనికి శాశ్వతంగా ఉండదన్నారు. మానవత్వాన్ని ఎక్కువ కాలం అణచిమని వేయలేమని చెప్పారు. సోమనాథ్ ఆలయాన్ని కొందరు దాడి చేసి ధ్వంసం చేశారని, వినాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని అయితే ఈ ఆలయం అన్ని పరీక్షలను, ప్రయత్నాలను జయించిందని చెప్పారు. సోమనాథ్ ఆలయం భవిష్యత్తుపై ఆశకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =