మహబూబాబాద్ నియోజకవర్గంలోని గుండెంగ గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

Mahabubabad Constituency, Mango News, Nirudyoga Nirahara Deeksha, Nirudyoga Nirahara Deeksha at Gundenga Village, YS Sharmila, YS Sharmila holds Nirudyoga Nirahara Deeksha, YS Sharmila LIVE, YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Nirudyoga Nirahara Deeksha at Gundenga Village, YS Sharmila Nirudyoga Nirahara Deeksha at Gundenga Village in Mahabubabad Constituency, YS Sharmila’s Udyoga Deeksha

రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, మంగళవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ నియోజకవర్గం, గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా గూడూరు మండలంలోని సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. సునీల్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానని పేర్కొంటూ, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం గుండెంగ గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ దీక్షాస్థలికి చేరుకుని ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో కూర్చొన్నారు.

గుండెంగ గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే జూలై 13 వనపర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడిప‌త్రి గ్రామంలో, జూలై 20న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లిలో, జూలై 27న నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని పుల్లెంల గ్రామంలో, ఆగస్టు 3న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లె గ్రామంలో, ఆగస్టు 10న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లంద‌కుంట మండ‌లంలోని సిరిసేడు గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =