తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ జ‌ప‌నీస్ సంస్థ‌

తెలంగాణ‌కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో భారీ పెట్టుబడికి ఒక ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. తాజాగా ప్రముఖ జ‌ప‌నీస్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ‌ ‘డైఫుకు’ రూ. 450 కోట్ల‌తో హైదరాబాద్‌లో తన యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు స‌మ‌క్షంలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సంస్థ తరపున మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ గ‌రిమెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్నాల‌జీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జపాన్ దేశమని, ఈ రంగంలో వారి నైపుణ్యం అద్భుతమని కొనియాడారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ మాన్యుఫ్యాక్చ‌రింగ్ సంస్థ ‘డైఫుకు’ మన హైదరాబాద్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గదని అన్నారు. హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో ‘డైఫుకు ఇండియా’ మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్ట‌మ్స్‌, క‌న్వేయ‌ర్లు మరియు ఆటోమేటిక్ స్టార్ట‌ర్స్ వంటి ప‌రిక‌రాల‌ను త‌యారు చేస్తుందని, దీనిలో భాగంగా తొలి దశలో రూ. 200 కోట్ల పెట్టుబడితో ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. హైద‌రాబాద్‌ కేంద్రంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని, తద్వారా లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతోందని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =