పీఎం కిసాన్ 9వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ

PM Narendra Modi Releases 9th Instalment Funds of PM Kisan Samman Nidhi Scheme, Mango News, PM Kisan, PM Kisan 2021, PM Kisan 9th instalment, PM Kisan Funds, PM Kisan Funds Released, PM Kisan News, PM Kisan Scheme, PM KISAN Scheme News, PM KISAN Scheme Status, PM KISAN Scheme Updates, PM Modi, PM Modi to Release More than Rs 19500, PM Modi to Release More than Rs 19500 Cr PM-KISAN Funds, PM Modi to Release More than Rs 19500 Cr PM-KISAN Funds on August 9th, PM to disburse next PM-KISAN instalment

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 9వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,75,46,378 మంది రైతులకు రూ.19,509 కోట్లకుపైగా నిధులను విడుదల చేశారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జరిగిన ఈ నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం సందర్భంగా వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌తో ప్ర‌ధాని మోదీ సంభాషించారు. ప్ర‌ధాని మోదీతో పాటుగా ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు.

ముందుగా ఫిబ్రవరి 24, 2019న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి దేశంలో అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరంలో నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బును నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద 9వ విడ‌త‌లో భాగంగా రూ.2000 సాయాన్ని రైతుల‌ ఖాతాల్లో జ‌మ చేసే ప్రక్రియను సోమవారం నాడు ప్రధాని ప్రారంభించారు. ఇందుకు అవ‌స‌ర‌మ‌య్యే రూ.19,509 కోట్లకుపైగా నిధులను ప్ర‌ధాని న‌రేంద్ర ‌మోదీ విడుద‌ల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =