ట్విట్టర్ సీఈఓగా వైదొలిగిన జాక్ డోర్సే, కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ కు బాధ్యతలు

Jack Dorsey Resigns, Jack Dorsey Steps Down as Twitter CEO, Mango News, New CEO Of Twitter, New CEO Of Twitter After Jack Dorsey Resigns, Parag Agarwal Becomes New CEO, Parag Agarwal Becomes New CEO Of Twitter, Parag Agarwal Becomes New CEO Of Twitter After Jack Dorsey Resigns, Parag Agrawal becomes Twitter CEO, Twitter CEO, Twitter CEO Jack Dorsey Steps Down, Twitter CEO Parag Agrawal key to Dorsey’s plans, Twitter Names Parag Agrawal As CEO After Jack Dorsey

సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాక్ డోర్సే నవంబర్ 29, సోమవారం నాడు తన పదవి నుండి తప్పుకున్నారు. దాదాపు 16 సంవత్సరాలగా కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈఓగా, సీఈఓ నుంచి ఛైర్మన్‌ గా, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ గా, ఆ తర్వాత తాత్కాలిక సీఈఓగా, సీఈఓగా బాధ్యతలు నిర్వహించానని, ఇక తప్పుకుంటున్నట్టు జాక్ డోర్సే ఓ ప్రకటన విడుదల చేశారు. కంపెనీ ప్రస్తుతం దాని వ్యవస్థాపకుల నుండి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని విశ్వసిస్తున్నానని, అందుకే ట్విట్టర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

కాగా ప్రస్తుతం ట్విట్టర్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) గా ఉన్న భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ నూతన సీఈఓ గా నియమిస్తూ కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. నూతన సీఈఓ పరాగ్ అగర్వాల్‌ పై జాక్ డోర్సే విశ్వాసం వ్యక్తం చేశాడు. “సీఈఓగా పరాగ్‌ సామర్థ్యంపై నాకు ఎంతో నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాలలో అతని పని పరివర్తన చెందింది. అతని నైపుణ్యం, హృదయం మరియు ఆత్మతో ముందుకు నడుపుతాడు. అతనికి నాయకత్వం అందించడానికి ఇదే సరైన సమయం” అని జాక్ డోర్సే పేర్కొన్నారు. ఇక పరాగ్ అగర్వాల్‌ ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. ట్విట్టర్ సీఈఓగా నియామకం కావడంపై స్పందిస్తూ ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తానని చెప్పారు. జాక్ డోర్సే మరియు మా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు భవిష్యత్తు కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పరాగ్ అగర్వాల్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twelve =