కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు షిర్డీ ఆలయం మూసివేత

Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19, Maharashtra Covid-19 rise, Mango News, Shirdi Sai Baba Temple, Shirdi Sai Baba Temple Close, Shirdi Sai Baba Temple Close News, Shirdi Sai Baba Temple in Maharashtra to be Closed, Shirdi Sai Baba Temple in Maharashtra to be Closed till April 30, Shirdi Sai Baba Temple to be Closed till April 30, Shirdi Sai Baba temple to remain closed, Shirdi temple shut till further orders

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో నైట్ కర్ఫ్యూ సహా వీకెండ్ లాక్‌డౌన్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 5, సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30వ తేది వరకు షిర్డీ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. షిర్డీలోని సాయిబాబా ఆలయంతో పాటుగా ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా మూసివేయబడతాయని, భక్తులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. అయితే రోజువారీ పూజా పారాయణం మరియు ఆలయంలోని అన్ని కార్యక్రమాలు పండితుల చేత యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు షిర్డీ ఆలయం తాత్కాలికంగా మూసివేసినప్పటికీ, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కొవిడ్‌ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులు మాత్రం పనిచేస్తాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =