లాక్‌డౌన్ నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి

Telangana DGP Mahender Reddy Monitors Lockdown Implementation in Hyderabad City,Mango News,Mango News Telugu,CM KCR,Lockdown,Telangana CM KCR,Telangana News,Lockdown In Telangana State,Telangana Lockdown Updates,Telangana State,Telangana Lockdown Live Updates,Telangana Lockdown News,Covid-19,Covid-19 In Telangana,Telangana Lockdown,Lockdown In Telangana,Telangana News,Telangana Lockdown News,Telangana Lockdown Update Today,Telangana,Telangana Lockdown Updates,Lockdown News In Telangana,Telangana Live News,Telangana Govt,Telangana DGP Mahender Reddy,DGP Mahender Reddy Live,DGP Mahender Reddy Press Meet,DGP Mahender Reddy Live Updates,DGP Mahender Reddy Monitors Lockdown Implementation in Hyderabad,Hyderabad

తెలంగాణ రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కీలక చర్యలను తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని జిల్లాల్లోనూ పోలీసుకు వాహనాల తనిఖీని చేపడుతున్నారు. పాస్‌లు, అనుమతులు ఉన్న వాహనాలనే అనుమతిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నాడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి లాక్‌డౌన్ విధివిధానాలను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా స్వయంగా పర్యవేక్షించారు.

లాక్‌డౌన్ నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి: 

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, లాక్‌డౌన్ అనేది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిందని, కొన్ని రోజులు మనం ఇంట్లో ఉంటే వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందదని, తద్వారా ఈ కరోనా నుండి అనేక మందిని కాపాడిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ప్రజలు వినియోగించుకోవాలని, తరువాత లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ పూర్తయ్యేవరకు వదలమని అన్నారు. నేషనల్ హైవేలు తప్ప, అన్ని సిటీలు, టౌన్స్ లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ను లాక్‌డౌన్ సమయంలో మూసివేయడం జరుగుతుందని చెప్పారు. కేవలం అవసర, అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలనే అనుమతిస్తామని అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు లాక్‌డౌన్ సమయంలో బయటకు రావొద్దని, ప్రభుత్వం జారీచేసిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + two =