మీ పాన్‌..ఆధార్‌తో లింక్‌ చేయలేదేమో.. ఇన్‌యాక్టివ్‌ అయిందేమోనని అనుమానమా? ఇలా చేయండి..

Do You Know The Process of Your PAN Card Link with Aadhar,Process of Your PAN Card Link,Do You Know PAN Card Link with Aadhar Process,The Process of Your PAN Card Link with Aadhar,Mango News,Mango News Telugu,How to Link PAN Card with Aadhaar Card,Aadhaar Card Pan Card Link Status,PAN Aadhaar Link,Income Tax Department e-Filing Portal,Six digit OTP,PAN is not linked with Aadhaar,PAN Card,Income Tax Department Latest News,Income Tax Department Latest Updates,Income Tax Department Live News,PAN Card Link with Aadhar News Today,PAN Card Link with Aadhar Latest News

ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయమంటూ ఇచ్చిన గడువులన్నీ ముగిసిపోయాయి. చివరకు రూ. 1000 ల ఫైన్‌ చెల్లించి లింక్ చేసుకోమని ఇచ్చిన గడువూ ముగిసిపోయింది. అందుకే ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయని పాన్‌ కార్డులు.. చాలావరకు ఇన్‌యాక్టివ్‌ అయ్యాయి. అయితే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసామో లేదో అన్న అనుమానంలోనే చాలామంది ఉండిపోయారు.

అలా అని పాన్, ఆధార్ లింక్ గురించి చెక్ చేసుకుందామనుకున్నా అవగాహన లేక కొందరు.. లింక్ గడువు మళ్లీ పొడిగిస్తారేమోనని నిర్లక్ష్యంతో మరికొందరు అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పుడు వరుసగా వింటున్న వార్తలతో తమ పాన్ కార్డు కూడా ఇన్ యాక్టివ్ అయ్యిందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పాన్‌ కార్డు పనిచేస్తుందా? లేదా అన్నది ఈజీగానే తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

పాన్‌ కార్డు ఇప్పుడు పని చేస్తుందో లేదో అన్న విషయం.. ఎలా తెలుసుకోవాలో అని ఏ మాత్రం కంగారు పడనవసరం లేదు. సులువుగా ఇంట్లో కూర్చొనే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ లోకి వెళ్లాలి. https://www.incometax.gov.in/iec/foportal/ పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇ ఫైలింగ్‌ పోర్టల్‌ ఓపెన్‌ అయ్యాక.. తర్వాత లెఫ్ట్ సైడులో పైభాగంలో ఉన్న హోమ్‌ బటన్ పై క్లిక్‌ చేయాలి.వెంటనే అక్కడ కొన్ని క్విక్‌ లింక్స్‌ కనిపిస్తాయి.

క్విక్‌ లింక్స్‌ లో.. వెరిఫై యు పాన్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే.. అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో పాన్ కార్డు నంబర్, మీ పూర్తి పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి కంటిన్యూ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు వెరిఫికేషన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్‌ చేస్తే.. అప్పుడు మీ పాన్‌ కార్డు వాలిడ్‌ అవునో కాదో తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్నిముఖ్యమైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. అవేంటంటే.. మీ మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ 15 నిమిషాలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందుకే ముందే మీ మొబైల్ నెట్వర్క్ సరిగ్గా పనిచేసే ఏరియాలో ఉన్నప్పుడే ఈ పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి. దీంతోపాటు కరెక్ట్ ఓటీపీని ఎంటర్‌ చేయడానికి మూడు సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఓటీపీని ఎంటర్‌ చేసేటప్పుడు.. కేర్ ఫుల్‌గా ఉండాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 17 =