టోక్యో పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, జావెలిన్‌ త్రోలో సుమిత్ అంటిల్‌ ప్రపంచరికార్డు

India’s Sumit Antil wins gold, Mango News, Sumit Antil wins gold, Sumit Antil Wins Gold Creates a World Record, Sumit Antil Wins Gold Creates a World Record in Javelin Throw, Sumit Antil Wins Gold Creates a World Record in Javelin Throw with 68.55 m, Sumit Antil wins gold in javelin throw, Sumit Antil wins Gold in Men’s Javelin throw, Sumit Antil wins gold with World Record, Sumit Antil wins gold with World Record in javelin throw, Tokyo Paralympics, Tokyo Paralympics 2020 Updates, Tokyo Paralympics-2020

టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్‌ 68.55 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ముందుగా తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సుమిత్ అంటిల్‌, రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం నాడు భారత్ ఖాతాలో మొత్తం (రెండు స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు) చేరడంతో పారాలింపిక్స్-2020లో భారత్ మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం షూటింగ్ (10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) విభాగంలో భారత మహిళా షూటర్‌ అవని లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =