యూఐడీఏఐ కీలక ప్రకటన.. ఆధార్ కార్డ్ జారీ చేసి 10 సంవత్సరాలు దాటితే అప్‌డేట్ చేసుకోవాలి

UIDAI Urges For The Document Updation If Aadhaar ID Older Than 10 Years Back, UIDAI Urges Document Updation, UIDAI Urges For The Document Updation, UIDAI Document Updation, Mango News, Mango News Telugu, UIDAI Urges Document Updation For Aadhaar, Update Documents For Aadhaar, UIDAI Urges Document Updation, UIDAI Urges Document Updation For Aadhaar, Aadhaar ID Older Than 10 Years Updation Compulsory, Aadhaar ID, UIDAI Latest News And Updates, UIDAI, UIDAI Aadhaar, Unique Identification Authority of India

భారతదేశ పౌరులకు ‘ఆధార్’ నంబర్‌లను జారీ చేసే ప్రభుత్వ ఏజెన్సీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) కీలక ప్రకటన చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డ్ జారీ చేసి 10 సంవత్సరాలు దాటితే తప్పనిసరిగా సంబంధిత వివరాలు మళ్ళీ అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. 10 ఏళ్ల క్రితం యూనిక్ ఐడీని జారీ చేసి, అప్పటి నుంచి తమ వివరాలను అప్‌డేట్ చేసుకోని ఆధార్ హోల్డర్లు డాక్యుమెంట్ అప్‌డేషన్ చేయాల్సిందిగా సూచించింది. దీనిలో భాగంగా గుర్తింపు, నివాస రుజువు పత్రాలను అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ తెలిపింది.

దీనికోసం ఆన్‌లైన్‌లో యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ‘మై ఆధార్ పోర్టల్‌’లో లేదా తమకు సమీపంలోని ఇతర ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా చేయవచ్చని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ స్కీమ్‌లు, ఇతర సేవలను పొందేందుకు ఆధార్ ప్రామాణీకరణ, ధృవీకరణలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు తమకు సంబంధించిన పూర్తి సమాచాారాన్ని అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. కాగా జూలై 12, 2016న భారతదేశంలోని నివాసితులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలనే లక్ష్యంతో ఆధార్ కార్డుల ప్రక్రియను అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పాటించేందుకు యుఐడీఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =